EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Latest Alajadi / చికెన్ తినడానికి వారం రోజుల సెలవు కావాలట

చికెన్ తినడానికి వారం రోజుల సెలవు కావాలట

Author:

సాధారణంగా మనం ఆఫీసుకి సెలవు ఎప్పుడు పెడతాం..? ఏదన్నా అర్జంటు పని ఉన్నపుడో.. లేక ఒంట్లో బాగా లేనప్పుడో ఆఫీసుకు డుమ్మా కొట్టేస్తాం. ఒక్కోసారి దగ్గరివాళ్ల ఫంక్షన్లు ఉన్నా, రాక రాక ఎవరన్నా బంధువులు ఇంటికి విచ్చేసినా ఆఫీసుకి సెలవు పెట్టేస్తాం. లేదూ.. ఇంకా చెప్పాలంటే ఏ బాహుబలి లాంటి సినిమా చూడదానికో కూడా సెలవు పెడితే ఓ అర్థం, పరమార్థం ఉంటాయి. కానీ, చత్తీస్ ఘడ్ కి చెందిన పంకజ్ రాజ్ అనే ఆయన మాత్రం ఓ వెరైటీ కారణంతో సెలవు కావాలని అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. అదేంటంటే.. నేను చికెన్ తినాలి నాకు సెలవు మంజూరు చేయండి అని పై అధికారులకు లెటర్ పెట్టాడు.

leave leatter for eat chicken

చికెన్ తినడానికి సెలవేంటి అనుకుంటున్నారా? సదరు పంకజ్ రాజ్ గారు ఓ కారణాన్ని కూడా తన వినతి పత్రం లో జత చేసారు. మరి కొద్ది రోజుల్లో శ్రావణ మాసం మొదలవనుంది. శ్రావణ మాసాన్ని పవిత్రంగా భావించే మేము ఆ సమయంలో చికెన్ ముట్టుకోం. అందుకని, నాకు జూన్ 20 నుంచి 27 వరకు ఓ వారం రోజుల పాటు సెలవు ఇస్తే, నేను కడుపారా చికెన్ ఆరగించేస్తాను. వచ్చే శ్రావణ మాసంలో చికెన్ ముట్టకుండానే పని చేయాల్సి వస్తుంది కదా… అందుకు తగ్గ శక్తిని కూడా ఇప్పుడే ఈ చికెన్ తిని తెచ్చుకుంటాను అని లీవ్ లెటర్ లో వివరంగా విన్నవించుకున్నాడట. అయితే, మరి ఆయన చికెన్ తినడానికి అధికారులు సెలవు ఇచ్చారో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. శ్రావణ మాసం సమయంలో హిందువులు మాంసాహారాన్ని ముట్టరనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ అందుకు ముందస్తు చర్యగా ఇలా ఓ వారం రోజుల పాటూ సెలవు తీసుకుని మరీ చికెన్ కుమ్మేద్దామనుకునే ఐడియా మాత్రం ఇప్పటిదాకా ఇంకెవరికీ రాలేదు.

ఇంత వెరైటీ గా సెలవు కావాలని కోరిన పంకజ్ రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడట. చత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన పంకజ్ పంపిన సెలవు పత్రం ఇప్పుడు ఆన్ లైన్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. పిచ్చ వైరల్ అయిన ఆ లీవ్ లెటర్ మీకోసం ప్రత్యకంగా అలజడి.కామ్ అందిస్తోంది. చదువుకొని తనివి తీరండి. వీలయితే చికెన్ తింటూ లెటర్ చదవండే….

leave letter for chicken

Comments

comments