ఆ గ్రామాల్లో గత 96 ఏళ్ళుగా ప్రతి శ్రీ రామనవమి ముందు రోజు వర్షం పడుతుంది.

Author:

raining in villages 95 years before sri rama navami

మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఎండలు మండి పోతున్నాయి దాదాపు 40డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. రోజురోజుకి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఎక్కడైన చిన్న చినుకు పడితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా…! కానీ ఆ గ్రామాల్లో ప్రతి  ఏటా సరిగ్గా శ్రీ రామనవమికి  ఒక రోజు ముందు అక్కడ వర్షం పడుతుంది. ఇలా ఒకటి రెండు కాదు గత 96 ఏళ్లుగా పడుతూనే ఉంది.

          తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి రాచలూరు, లేమూరు, కందుకూరు, మకాన్‌ తదితర గ్రామాల్లో నిన్న(మంగళవారం) సాయంత్రం ఓ మోస్తారు వాన కురిసింది. మామూలుగా అయితే అదో పెద్ద విశేషం కాదు. కానీ.. ఆ గ్రామాల్లో 96 ఏళ్లుగా, ఇలా ఏటా శ్రీరామనవమి ముందురోజు వర్షం కురుస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఆనవాయితీ కురిసింది. దీంతో.. ఆ శ్రీరామచంద్రుడి కృప తమపై ఉందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

(Visited 21,920 times, 234 visits today)

Comments

comments