EDITION English తెలుగు
Home / Entertainment / రాజమౌళి ‘గరుడ’ లో భీష్ముడి గా ‘బిగ్ బి’ అమితాబ్,కీలక పాత్రలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని..!

రాజమౌళి ‘గరుడ’ లో భీష్ముడి గా ‘బిగ్ బి’ అమితాబ్,కీలక పాత్రలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని..!

Author:

రాజమౌళి ‘గరుడ’ కథ ‘మహాభారతం’ నేపథ్యంలోనే ఉంటుందా? అవునని కొందరు, కాదని కొందరు సినీ క్రిటిక్స్ వాదులాడుకుంటున్న టైమ్ లోనే, ఇంకో ఎమేజింగ్ వార్త బయటకొచ్చింది. ఇప్పటికే ఈ ‘గరుడ’ పైన రాజమౌళి ఐదుగురు ప్రముఖులను సంప్రదించారనీ, అందులో ఇద్దరు సాహితీ సినీ రంగాలతో సంబంధాలున్నవారనీ, మిగిలిన ముగ్గురిలో ఒకరు బిగ్ ‘బీ’ అనీ, ఇంకొకరు థియేటర్-కమ్-మూవీ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ అనీ, ఆఖరున డ్రీమ్ గర్ల్ హేమమాలిని అనీ భోగట్టా! గరుడ సినిమా స్క్రిప్ట్ లో భాగంగా పురాణ పురుషుడు గరుత్మంతుడి కథను ఇతిహాసానికి కనెక్ట్ చేస్తూ సినేమాటిక్ గా మలచటానికి సామవేదం షణ్ముఖ శర్మ సూచనలు, సలహాలు అడిగినట్టు తెలుస్తోంది. దీని పైన ఇప్పటికే రాజమౌళి-సామవేదం షణ్ముఖ శర్మ రెండు మూడు దఫాలు సుదీర్ఘంగా చర్చించుకున్నారనీ, కథ స్వరూప స్వభావాలు ఫైనలైజ్ అయిన తర్వాత స్క్రిప్ట్ కు తుది రూపు ఇవ్వటం కోసం విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పని చేయటానికి సామవేదం షణ్ముఖ శర్మ సూత్రప్రాయంగా అంగీకరించారనీ ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా! ఇదంతా చెవులతో విన్నదే కాబట్టి ఇన్ఫర్మేషన్ అనుకోవాలా అని అడిగితే, ఫిల్మ్ నగర్ బాబులు ‘దేవుడి తోడు..ఇది నిజం’ అని చెబుతున్నారు.

Trivikram Srinivas , Samavedham Shanmuka Sharma and Rajamouli Garuda

ఇహ ఇందులో మహేష్ బాబు నటిస్తాడన్న ప్రచారం ఓవైపు … జూనియర్ ఎన్టీ ఆర్,  మోహన్ లాల్ తో కీలక పాత్రలు చేయించడానికి కూడా మరో వైపు టాక్స్ నడుస్తున్నట్టు మరో వార్త. ఇవన్నీ ఇలా ఉంటే…..కథ లో ఉండే డిమాండ్ దృష్ట్యా, స్క్రీన్ కు మరింత వెయిట్ కోసం బిగ్  బీ అమితాబ్ చేత ఇందులో ‘భీష్మ’ పాత్ర చేయించటానికి ఆయనతో రాజమౌళి…హిందీ సినిమా రంగం లోతనకున్న పరిచయాలద్వారా సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. కథ లో కొంత మేరకు రామాయణం నుంచి కూడా తీసుకోవలసి ఉంటుంది కాబట్టి……అందులో కొన్ని పౌరాణిక పాత్రల కోసం హిందీ చిత్ర రంగ ప్రముఖులను ఎంపిక చేసుకోవచ్చునంటున్నారు. ఇప్పటికే రామాయణం లేదా మహా భారతం సీన్స్ కు సంబంధించి ఏదో ఒక పాత్రలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని ని కూడా కన్సిడర్ చేయవచ్చు నంటున్నారు. అనుపమ్ ఖేర్ ని అయితే..శకుని పాత్ర కు ఎంపిక చేసే అవకాశం ఉంది. అమితాబ్ వయసు, నటనానుభవం, పర్సనాలిటీ ..భీష్మ పాత్ర కు సూట్ అవుతాయనే టాక్ నడుస్తోంది.

ఇవన్నీ అటుంచితే, అసలు గరుత్మంతుడి పాత్ర కు సూట్ అవ్వాల్సిన కొటేరు లాంటి ముక్కు పైన ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. కొనదేలిన ముక్కును ఆ పాత్ర డిమాండ్ చేస్తుంది కాబట్టి….అది మహేష్ బాబు కే ఎక్కువ అవకాశం ఇండికేట్ చేస్తోంది. అటు రామాయణాన్ని, ఇటు మహాభారతాన్ని మిళితం చేసే మహా యజ్ఞం కాబట్టి….పౌరాణిక పాత్రలలో ఆరితేరిన బాలకృష్ణ, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీ ఆర్ లకు కచ్చితంగా ‘గరుడ’ లో మంచి ప్లేస్ మెంట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ బాబులు బల్ల గుద్ది మరీ చెపుతున్నారు. స్క్రీన్ ప్లే కోసం …అవసరమైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్టు కూడా సమాచారం.మొత్తానికి రాజమౌళి ‘గరుడ’ పురాణానికి ….ఆది నుంచే మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

(Visited 169 times, 30 visits today)