రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ..!

Author:

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ నిజంగానే నటించబోతున్నారు కానీ షార్ట్ ఫిలిమ్ లో..రోజురోజుకి పెరిగిపోతున్న నేరాలని అదుపు చేయడానికి పోలీసులు అనేక విధాలుగా కృషి చేస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి, సోషల్ మీడియా ల ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువ ఆన్ లైన్ మోసాలు జరుగుతుండటం, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం అని ఓటీపీ అడగడం, ఈజీగా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించవచ్చని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి మోసం చెయ్యడం, ఆన్ లైన్ జాబ్స్ అంటూ మోసం చెయ్యడం లాంటి సైబర్ నేరాల ఉచ్చులో ప్రజలు పడకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు కొన్ని షార్ట్ ఫిలిమ్ లని తీస్తున్నారు.ఈ వీడియోలలో టాలీవుడ్ సెలబ్రెటీలు కనిపించనున్నారు.

NTR-Vijay-devarakonda-and-Rajamouli-Multi-Starrer

ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ ల్లో జూనియర్ NTR, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాజమౌళితో రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ఆసక్తి రేపుతున్నాయి. గతంలోనూ కొన్ని అవేర్ నెస్ షార్ట్ ఫిల్మ్స్ లో రాజమౌళి కనిపించాడు. ఇప్పుడు జూనియర్ NTR, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండలతో కలిసి కనిపించనున్నాడు. సినిమా స్టార్స్ ఈ క్యాంపెయిన్ లో చేరటం వల్ల మరింత ప్రచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ పై రూపొందిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ను సినిమా ధియేటర్లలో ప్రదర్శించనున్నారు.

(Visited 286 times, 307 visits today)