EDITION English తెలుగు
పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ   ఈ రోజు: 20-10-2018 (శనివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 19-10-2018 (శుక్రవారం ) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

వచ్చే ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేస్తా – రజనీకాంత్

Author:

మధ్య తరగతి కుటుంబంలో పుట్టి బస్ కండక్టర్ గా జీవితం మొదలుపెట్టి స్వయంకృషితో సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు, కొన్ని నెలలుగా రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ఉత్కంఠకు రజనీకాంత్‌ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. చెన్నైలో ఇప్పటికే పలుమార్లు అభిమానులతో సమావేశమైన తలైవా నిన్న జరిగిన సమావేశంలో రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు.

రజనీకాంత్‌

దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని… వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు.

‘ప్రస్తుతం రాజ్యం ఏలుతున్న పార్టీలు ప్రజలకు దోచుకుంటున్నాయి. నేనురాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మూడేళ్లలోనే రాజీనామా చేస్తాను. నేను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చెడిపోయింది. తమిళనాడు రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు హేళన చేసి మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోకపోతే పెద్ద తప్పు చేసినవాడినవుతాను. ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. రాజకీయాలు నాకు కొత్తేం కాదు. 1996లోనే నేను రాజకీయాల్లో ఉన్నాను’ అన్నారు.

(Visited 88 times, 115 visits today)