Home / Entertainment / రామ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్.

రామ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్.

Author:

గత కొంత కాలంగా హిట్ సినిమాల రేసులో వెనకబడ్డ చాక్లెట్ బాయ్ రామ్ ఇటీవలే విడుదల అయిన నేను-శైలజా సినిమాతో కాస్త ఊపిరితీసుకుని, చాలా కాలం తర్వాత తన నుంచి ఓ హిట్ సినిమా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఓ పక్క అభిమానులు, మరో పక్క ఇండస్ట్రీ కూడా రామ్ నెక్స్ట్ సినిమా ఎలా ప్లాన్ చేసుకోబోతున్నడా అని ఓ కన్నేసాయి. అయితే రామ్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని గతంలో కందిరీగ అంటూ సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో ఖాయం చేసాడు.

Ram, Rakul Preet Singh in Pandaga Chesko Movie Gallery

దర్శకుడు కూడా కన్ఫర్మ్ అయ్యాడు కాబట్టి, ఆ తరువాత కథానాయికని వెతికే పనిలో పడ్డారు, కాగా ముందునుంచీ రామ్ కి తన సరసన ఫ్లాప్ సినిమాల హీరొయిన్లని పెట్టుకుంటాడని పేరు ఉంది. నిన్న మొన్నటి వరకూ విన్న వార్తల ప్రకారం తన తదుపరి సినిమాలో తమన్నా లేదా రాశీ ఖన్నా నటించబోతున్నారు, కానీ ఈలోగా ఏమనుకున్నారో ఏమో సడన్ గా రకుల్ పేరు వినబడుతుంది. గతంలో శివంలో రాశీతో , ఎందుకంటే ప్రేమంటతో తమన్నాతో ఫ్లాప్ సినిమాలు పడటం వల్ల వాళ్ళిద్దరినీ తప్పించి రకుల్ ని పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా మొత్తానికి మా హీరో ఈసారైనా హిట్ సినిమా హీరొయిన్ ని పెట్టుకున్నాడని ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు.

(Visited 92 times, 26 visits today)