రామ్ చరణ్ కు ప్రేమతో ఓ సినిమా అంటున్న సుకుమార్.

Author:

Ram Charan Movie With Sukumar

చిరంజీవి వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో రామ్‌ చరణ్‌, తోలి సినిమాతోనే సుపర్ హిట్ కొట్టి రెండవ సినిమాతో తెలుగు సినిమా గుర్తుంచుకునే సినిమా ఇచ్చాడు. ఈ మధ్యా వరుసగా గోవిందుడు అందరివాడు, బ్రూస్‌లీ పరాజయలతో కెరీర్‌ పరంగా రామ్‌చరణ్‌కు సరికొత్త పాఠాల్ని నేర్పాయేమో కథల ఎంపికలో ఇక ముందు ఆచితూచి వ్యవహరించాలని, కమర్షియల్ పంథాలోనే సాగుతూ ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకోవాలనే నిర్ణయానికి రామ్‌చరణ్ వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.తెలుగులో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ఓ నిర్మాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడట. ఆ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయడానికి నిర్మాత రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ తాజాగా నటించనున్న సినిమా ‘రక్షక్'(వర్కింగ్ టైటిల్). తమిళ హిట్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా రూపొందనున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న విషయం మనకు తెలిసిందే.

(Visited 210 times, 18 visits today)