“తని ఒరువన్” తెలుగు టైటిల్ ఫిక్స్.

Author:

Dhruva

రామ్ చరణ్ హీరోగా తమిళ రీమేక్ చిత్రం ‘తని ఒరువన్’ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో మొదట ‘రక్షక్’ అనే టైటిల్ ని అనుకున్న తాజాగా ఆ టైటిల్ లో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీనియర్ పీఆర్ఓ, నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ ద్వారా తని ఒరువన్ చిత్రానికి ‘ధ్రువ’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలిపాడు..

ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే, ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఫిబ్రవరి 18న అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరైనోడు’ చిత్ర టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు.అదే రోజు అనగ ఫిబ్రవరి 18 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు రాజు తెలిపాడు.

(Visited 157 times, 22 visits today)