Home / Entertainment / వర్మ మళ్ళీ చెలరేగిపోయాడు.

వర్మ మళ్ళీ చెలరేగిపోయాడు.

Author:

Ram Gopal Varma Tweets

వర్మకి ఎప్పుదు ఏ సిటుయేషన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు అనుకుంటారంతా. ఐతే వర్మ కొన్ని సార్లు నిజంగా స్పందించినా అదికూడా పబ్లిసిటీలో భాగమే అనుకునే దాకా వచ్చేసారు జనం. ఐతే నిజానికి వర్మ చాలా సార్లు కొన్ని అవసరమైన ప్రశ్నలే లేవనెత్తుతాడనీ.. కానీ జనాలు మాత్రం దాన్ని కూడా పబ్లిసిటీ కోసమే చేసాడనుకుంటారనీ ఆయన కి ఉందే అతికొద్దిమంది సన్నిహితులు అంటూ ఉంటారు. దేవుడి గురించి కానీ,కొన్ని మూడనమ్మకాల విశయం లో కానీ వర్మ ప్రశ్నలు సూటిగా ఉంటాయి. మొన్నటిదాకా కుర్ర హీరో రాజ్ తరుణ్ తో వివాదాస్పదమైన ట్వీట్లతో జనాలందరినీ ఒకాటాడుకున్న వర్మ మళ్ళీ తన పాత తరహా ప్రశ్నలకు తెర తీసాడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడులు, అనంతర పరిణామాలను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు. “ఇప్పుడు దేశాలు ఇతర దేశాల సహాయం తీసుకున్నట్లే దేవుళ్లు కూడా ఇతర దేవుళ్ల సాయం తీసుకుంటారా ? అహ..జస్ట్ అడుగుతున్నాను”. అన్న ట్వీట్ తో తన పంచ్ లు మొదలు పెట్టిన వర్మ ఇక ఆపకుండా మతం,దేవుడు అంశాలని కడిగి పడేసాడు.

ఒకవేళ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటే.. ఆయన పేరు మీద జరుగుతున్న హింసను చూస్తూ శాడిస్టికల్లీ ఎంజాయ్ చేయడం తప్ప బయటకి వచ్చి ఎందుకు మాట్లాడడు? తన పేరుతో జరుగుతున్న మానవ హింసను అడ్డుకునే శక్తి దేవుడికి లేనప్పుడు… అసలు దేవుడు అనిపించుకోవడంలో అర్థమేముంది? అమాయకులను చంపేసిన టెర్రరిస్టుల పట్ల నిరసన వ్యక్తం చేయడం బదులు.. టెర్రరిస్టులకు ఆ అవకాశం కల్పించిన భగవంతుడి పట్ల మనం నిరసన తెలపాలి. అమెరికా, పుతిన్, కొందరు ముస్లిం నాయకులతో పోల్చి చూస్తే నిజంగా దేవుడే టెర్రరిస్టుల పక్షాన ఉన్నట్లు కనిపిస్తోంది. ఇకనైనా ఒక్కసారి బయటకు వచ్చి తను ఎవరి తరఫున ఉన్నాడో నిరూపించుకోవడానికి దేవుడికి ఇదే సరైన సమయం..అంటూ రామూ చెలరేగిపోయాడు.సో ఇంకో నాలుగు రోజుల పాటు వచ్చే రిప్లై లతో వర్మ వార్తల్లో ఉంటాడన్నమాట….

(Visited 54 times, 24 visits today)