రామ్ కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్

Author:

ram-srinivas-14-reels

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా రోజుల తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తన నటన, డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో ‘నేను శైలజ’ సినిమా విజయాన్ని మనసారా ఆస్వాదించి ఇప్పుడు మళ్ళీ తన తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అని చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక శుభ వార్త.

రామ్ తో కందిరీగ  వంటి బ్లాక్ బ్లాస్టర్ తో తెలుగు చిత్ర పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్ శ్రీనివాస్, ఇప్పుడు మరొక సారి ఈ ఇద్దరు పరిశ్రమకి మంచి హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఈ నెల 8వ తేదిన మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాను 14రీల్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు.

(Visited 424 times, 24 visits today)