EDITION English తెలుగు
ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   23-10-2018 మంగళవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 23-10-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   రెహానా ఫాతిమానుముస్లిం కమ్యూనిటీనుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ మత పెద్దలు ప్రకటించారు.   22-10-2018 సోమవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 21-10-2018 (ఆదివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ

Video: నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే సౌండ్ ఇంజనీరు.

Author:

ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 1985 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా “రంగస్థలం”, ఈ సినిమా టైటిల్ లుక్ విడుదల చేసినప్పుడే సుకుమార్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడని తెలిసిపోయింది, రంగస్థలం టీజర్ ఈ రోజు విడుదల చేసారు.

రంగస్థలం రామ్ రామ్ చరణ్

టీజర్లో మొత్తంగా రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో పరిచయం చేశాడు సుకుమార్. ఈ టీజర్ లో రామ్ చరణ్ ని సరికొత్త గెటప్ లో చూపించారు, రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ, గోదావరి యాస అన్ని సరికొత్తగా ఉన్నాయి, సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా వినికిడి సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా రామ్ చరణ్ నటించాడు. బాధ అంటే బాధ కాదు.. మనోడు చెవులు వినబడకపోయినా.. పెదాలను బట్టి అవతలి వాళ్ళు ఏం మాట్లాడారో అర్ధం చేసుకుంటాడు.

టీజర్ లో రామ్ చరణ్ ‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటూ ఒక కత్తి పట్టుకొని సీరియస్ గా నడిచివస్తున్న సీన్ అదిరిపోయింది, ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమాగా రంగస్థలం రూపొందుతున్నట్లు తెలుస్తుంది, ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా, ఆది పినిశెట్టి, అనసూయ ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు.

(Visited 74 times, 94 visits today)