EDITION English తెలుగు
Home / General / కొత్త సిరీస్ తో రానున్న రూ.500 నోట్లు

కొత్త సిరీస్ తో రానున్న రూ.500 నోట్లు

Author:

త్వరలోనే కొత్త 500 రూపాయల నోటు రానుంది. కొత్త నోటు అంటే మళ్ళీ ఇప్పుడు చలామణీలో ఉన్న నోటు రద్దు కానుందా… అని అనుకోకండి. అలాంటిదేం లేడు. ఇప్పుడు వాడుకలో ఉన్న రూ. 500 నోట్లకే కొన్నిసెక్యూరిటీ ఫీచర్లు జోడించి కొత్త వాటిని విడుదల చేస్తున్నట్లు RBI ప్రకటించింది. నోట్లు కొత్త సిరీస్ తో రానున్నాయని కూడా తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో పాటు, నోటు వెనక వైపు 2017 అని ముద్రించి విడుదల చేసినట్టు మంగళవారం (జూన్13)న ప్రకటించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న రూ. 500 నోట్లు కూడా చలామణిలో ఉంటాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. కేవలం కొత్త సిరీస్ తో మాత్రమే నోట్లు విడుదల చేస్తున్నామని, ఇది గమనించాలని సూచించారు. గత ఏడాది నవంబర్ లో రూ.500, రూ.1000 పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఈ కొత్త రూ.500, 2000 నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

new futures in 500 rupees note

దాదాపు పాతనోటునే పోలిన ఈ కొత్త నోటు ఎలా ఉన్నదంటే… 66mmx150mm సైజుతో స్టోన్‌ గ్రే కలర్ తో ముద్రించారు. ఎర్ర కోట, రివర్స్ లో భారతీయ జెండా స్పెసిఫికేషన్స్‌ తో ఈ నోటుని రూపొందించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్‌ స్థంభం కుడివైపున బ్లీడ్‌ లైన్స్‌.. ఇతర గుర్తులతోపాటు… అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణను కూడా జత చేసినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

(Visited 200 times, 40 visits today)