ఈ-వ్యాలెట్ రీఛార్జీకి కేవైసి తప్పని సరి-రేపటితో RBI గడువు ఆఖరు

Author:

నోట్ల రద్దు పుణ్యమా అని అందరికీ ఈ-వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో పేటీఎం, మొబి క్విక్, ఓలా మనీ, అమెజాన్ పే లాంటివి బాగా ఆకర్షించాయి కూడా!

తాజాగా మొబైల్ వ్యాలెట్లకు సమర్పించాల్సిన కేవైసి వివరాల ధృవీకరణ గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్నదనీ, దీనిని పొడిగించే అవకాశం లేదనీ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.

వ్యాలెట్లు తిరిగి రీఛార్జీ చేసకోవాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ బీపి కానుంగో అన్నారు.ప్రస్తుతం దేశంలో బ్యాంకుతో అను సంధానించబడిన వ్యాలెట్లు 50 మరియు బ్యాంకేతర వ్యాలెట్లు 55 పని చేస్తున్నాయని తెలియ జేశారు. కాగా రిజర్వు బ్యాంకు ఇది వరకే కేవైసి సమర్పణ కు చివరి తేదీని గత ఏడాది డిసెంబ31నుంచి ఈఏడాది ఫిబ్రవరి 28వరకు పొడిగించింది.

m2

90% మంది ఈ వ్యాలెట్ సేవలను వినియోగదారులు తమ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ తోనే పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవైసి సమర్పించని వారు కలవర పడవలసిన అవసరం లేదని,వారి వ్యాలెట్లలో ఇది వరకే ఉన్న మొత్తాన్ని సరుకుల కొనగోలుకు సేవలకు వాడుకోవచ్చని అభయమిస్తున్నారు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 248 visits today)