EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

5ఏజీ, 3ఏపీ సిరీస్‌ కరెన్సీ నోట్లతో జాగ్రత్త..!రిజర్వు బ్యాంకు ప్రకటన.

Author:

RBI Fake Notes

నకిలీ కరెన్సీ నోటుని మీరు మొదటి చూపులోనే ఎలా గుర్తిస్తారు? మొట్ట మొదటగా మీరు చూసేది కరెన్సీ నోట్ల భద్రతకు ప్రామాణికంగా నిలిచే ‘సిల్వర్‌ త్రెడ్‌’ (నోటులో తీగలాగా మెరుస్తూ కనిపించేది) నే. ఐతే ఈ ముఖ్యమైన “గుర్తింపు లేకుండానే ఏకంగా ప్రభుత్వమే వెయ్యి రూపాయిల నోట్లను ముద్రించింది.అవి చలామనీలోకి వచ్చేసాయి కూడా, జరిగిన దారుణమైన పొరపాటుని ఆర్బీఐ ఆలస్యంగా గుర్తించి నాలుక కరచుకుంది. సిల్వర్ త్రెడ్ లేకుండా వచ్చిన ఈ నోట్లు భారత దేశ రిజర్వ్ బ్యాంక్ ముద్రించినవే అయినా అవి చెల్లవు.అయితే ఇప్పటికే అవి మార్కెట్ లోకి ప్రవేశించటంతో తలలు పట్టుకున్నారు. అయితే వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలూ మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్‌, మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎమ్‌సీఐఎల్‌)లో ప్రింట్ అయిన కొన్ని సిరీస్ కరెన్సీ నోట్లలో ఈ పొరపాటు జరిగిందని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంగీకరించింది. 5ఏజీ, 3ఏపీ సిరీస్‌తో ఈ నోట్లను ముద్రించారు. అయితే ఖచ్చితంగా ఎన్ని నోట్లను ముద్రించారో మాత్రం బయటికి వెల్లడించలేదు.నిజానికి ఎన్ని అధికారిక ముద్రలున్నా ఈ సిల్వర్‌ త్రెడ్‌ గనక లేకపోతే కరెన్సీ నోట్లు చెల్లవు,అవి నకీలీ నోట్ల పరిధిలోకే వస్తాయి.అందుకే ప్రజలు గనక ఈ సిరీస్‌లతో ఉన్న నోట్లను మార్చుకునేందుకు ఏబ్యాంకు కువచ్చినా ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకానివ్వకుండా ఆ నోట్లు తీసుకొని తీసుకొని వాటికి సమానమైన చెల్లుబాటయ్యే నోట్లు ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. మరోవైపు, ముద్రణలో ఈ లోపంపై వివరణ ఇవ్వాలని ఎస్‌పీఎమ్‌సీఐఎల్‌ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ ఉదంతంపై నివేదిక కోరింది.మీ నోట్లనీ ఒక సారి చెక్ చేసుకోండి మరి….

Must Read: యుట్యూబ్ లో సెన్సేషన్ క్రీయేట్ చేస్తున్న మెగా హీరోయిన్.

(Visited 4,299 times, 17 visits today)

Comments

comments