ఏటీఎం నుండి రోజుకి రూ.10 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు.

Author:

నోట్ల రద్దు చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ ఈరోజు ఎంతోమంది ప్రజలకి ఊరటని ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది, ఏటీఎం ల ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకునే పరిమితి ని 4500 రూపాయల నుండి 10000 రూపాయలకు పెంచినట్లు ప్రకటించింది, ఇప్పటి నుండి సేవింగ్స్ అకౌంట్ నుండి ఏటీఎంల ద్వారా రోజుకి 10000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు, అలాగే పాత నిర్ణయం ప్రకారం కరెంట్ అకౌంట్ నుండి రోజుకి 50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే ఆవకాశం ఉండేది, ఇక ఇప్పటినుండి కరెంట్ అకౌంట్ నుండి రోజుకి లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

atm-with-d

గత ఏడాది నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను చాలా ఇబ్బందుల పాలు చేసింది. దానికితోడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. నోట్ల రద్దు తర్వాత ఇంతవరకు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలలో సామాన్యులకు బాగా ఉపయోగపడేది ఈ రోజు ప్రకటించిన 10,000 రూపాయల విత్ డ్రా లిమిట్ అని చెప్పుకోవచ్చు.

(Visited 1,416 times, 46 visits today)