Home / Inspiring Stories / ఆత్మహత్య తర్వాత ఆత్మ ఏమౌతుందీ..?

ఆత్మహత్య తర్వాత ఆత్మ ఏమౌతుందీ..?

Author:

Soul After Death Hindu

మరణం తర్వాత ఏం జరుగుతుందీ…? అత్మ అధో: ఊర్థ్వ లోకాల్లోకి పయణిస్తుందీ అంటుంది గరుఢ పురాణం, హైందవధర్మానుసారం భౌతిక శరీరం చేసిన కర్మలకుగానూ ఆత్మ వివిద శిక్షలను అనుభవిస్తుంది. పుణ్యకాలం పూర్తి అయేంత వరకూ భగవంతునికి దగ్గరగా అత్యంత ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ కర్మ సిద్దంతాన్ని భోదించిన భగవత్గీత ప్రకారం ఆయా జన్మల కర్మ ఫలాన్ని అనుభవించటానికి కర్మల ఫలాన్ని తీసుకొని మరో జన్మకోసం ఇంకొక జన్మని పొందుతుంది ఆ ఆత్మ..కానీ ఆ మనిషి తన జీవిత కాలాన్ని పూర్తి చేయకుండానే మరణిస్తే..? పూర్వజన్మ కర్మ ఫలాన్ని పూర్తి చేయకుండానే అతను తన భౌతిక దేహాన్ని ఆత్మహత్య ద్వారా ముగించేస్తే..? ఆ కర్మఫలాన్ని ఎవరు అనుభవించాలి? అసంపూర్తిగా మిగిలిన ఆ మిగిలిన జీవితాన్ని ఎవరు పూర్తి చేస్తారు…?

ఆత్మహత్య అనేది సహజ మరణం కాదు. మరణానికి ఇదో మార్గం మాత్రమే మన చేయాల్సిన పనిని మధ్యలో వదిలేసి ఈ భౌతిక కర్మల నుంచి తాత్కాలికంగా తప్పుకోవటమే…! ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి బలవంతంగా తన మరణాన్ని కోరుకోవడం, తమ ప్రాణాలను తన చేతులతో తీసుకోవడం. ఉరి వేసుకోవడం, పాయిజన్ తీసుకోవడం, పురుగుల మందు వంటి రకరకాలుగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ఏమవుతుంది ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మలో ఎలాంటి మార్పులు వస్తాయి ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ బతికే ఉంటుందా ? అసలు ఆత్మహత్య తర్వాత వాళ్లు స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారా ? వెళ్లరా ?

సహజ మరణానికి, ఆత్మహత్యకు చాలా తేడా ఉంటుంది. ఈ రెండు పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ రెండు ఆత్మలో మార్పులు వేర్వేరుగా ఉంటాయి.ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తాలూకు సూక్ష్మ దేహం భూమిని వదిలి అధోలోకాలకు వెళ్ళదు. వాళ్లు భూమి మీద జరిగే ప్రతి విషయాన్నీ గుర్తించగలుగుతారు.ఆత్మహత్య చేసుకున్న వాళ్లు.. ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని గుర్తించగలుగుతారు. వాళ్లు ఎవరితో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయి ఉంటారో వాళ్లను కూడా చూడగలుగుతారు. సహజ మరణం పొందిన ఆత్మలా వాళ్ళు ఈ ఇక్కడి ఙ్ఞాపకాలను మరిచిపోలేరు కూడా..! ఉదాహరణకు ఒక వ్యక్తి 90 ఏళ్లు జీవించాల్సి ఉంటుంది. కానీ.. 20 ఏళ్లలోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.. మిగిలిన 70 ఏళ్ల జీవితాన్ని కామ లోకంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అనుభవించాల్సిందే. 70 ఏళ్ల తర్వాతే.. వాళ్ల జీవితం పూర్తవుతుందన్నమాట.అప్పటివరకూ తాము చేసిన తప్పు ఎంతటి శిక్షని విధించిందో చూస్తూ కుమిలిపోతూంటారు…

వాళ్ల పూర్తీ జీవితకాలం పూర్తి అవకుండా మరణ ప్రక్రియ పూర్తి కాదు. అంటే నిజానికి వారి వాళ్ల జీవిత కాలం నిజానికి పూర్తి కానట్టే లెక్క పూర్తయ్యే వరకు ఈ లోకంలోనే ఉండి.వారికి పుట్టుకలో నిర్దేశించబడ్డ జీవితకాలం పూర్తయిన ఆ తర్వాతే. స్వర్గంలోకి కానీ, నరకంలోకి కానీ వెళ్లగలుగుతారు. ఆత్మహత్య అంటే నిజానికి ఒక హత్యకిందకే వస్తుంది అది ఒక మనిషిని మీరు చంపినప్పుడు ఎంత పాపమో అదే పాపం మీరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మీ ఖర్మ ప్రకారం ఒక శిక్ష అనుభవించటానికి కారణంగా నిర్ణయించబడుతుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ల ప్రక్రియ, సహజంగా మరణించిన వాళ్ల ప్రక్రియకు పూర్తీగా విభిన్నంగా ఉంటుంది. సహజంగా మరణించినవాళ్లు.. వాళ్ల జీవిత కాలం పూర్తి అయిన తర్వాత, వాళ్ల లక్ష్యాలు నెరవేరిన తర్వాత మరణిస్తారు.కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్లు వాళ్ల ఆత్మను పూర్తీగా కోల్పోయి ఉంటారు. అయితే.. వాళ్ల జీవితం ఎప్పుడైతే ముగుస్తుందో.. అప్పుడు వాళ్లు నిజమైన మరణాన్ని పొందుతారు.

ఆత్మహత్యకు చాలా సందర్భల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా.. లవ్ లో ఫెయిల్ అయినా,.. ఇంట్లో పేరెంట్స్ తిట్టినా, స్కూల్ టీచర్ కొట్టినా.. చిన్నపాటి మనస్పర్దలు వచ్చినా.. తమ అందమైన జీవితానికి సెలవిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించినా, మనకు నచ్చిన వాళ్లతో మాట్లాడినా.. ఈ ఆత్మహత్య ఆలోచనకు దూరం కావచ్చు. కానీ ఎవరితో మాట్లాడకుండా మనోవేదనకు గురై.. చివరకు ప్రాణాలనే తీసుకునే భయంకరమైన ఆలోచనకు పురుడుపోస్తున్నారు.తద్వారా వారు అంతకంటే ధారుణమైన కష్టాల్లోకి వెళ్తున్నారన్న విశయం వారికి పట్టదు…. నిజానికి ఒక వ్యక్తి ఆత్మ హత్య చేసుకోవటం అంటే తనకు తానే ఒక భయంకరమైన శిక్షని వేసుకోవటం… ఇక్కడ వచ్చిన చిన్న భాదని తప్పించుకోవటానికి మరో భయంకరమైన భాదలోకి వెళ్ళటమే., ఇక్కడే ఉంటే వచ్చిన భాద కొన్నాళ్ళకి తగ్గిపోవచ్చు లేదా ఇక్కడే కొన్ని ఖర్మల ద్వారా మరణానంతర శిక్షని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఆత్మహత్య అంటే పాతకర్మలని చేయకుందా పోవటమే కాక… వచ్చే జన్మలో ఆత్మహత్య అనే పాపం కూడా తోడై మరిన్ని భాదలకు కారణం ఔతుంది…

(Visited 3,581 times, 87 visits today)