EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా…!

షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా…!

Author:

గడువులోగా బడ్జెట్ ని సెనేట్ లో ఆమోదించలేకపోవడం వల్ల అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మూతపడింది, అమెరికా సెనేట్ లో సభ్యులుగా ఉన్న డెమొక్రటిక్ , రిపబ్లికన్ సెనెటర్ ల మధ్య వలసదారుల విషయంలో వచ్చిన విభేదాల వల్ల ఈ సంక్షోభం వచ్చింది, దీంతో ప్రభుత్వ వార్షిక లావాదేవీలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం. ద్రవ్య వినిమయ బిల్లుకు అమెరికా సేనేట్ లో ఆమోదం లభించకపోవడానికి అమెరికా డ్రీమర్స్ (వలసదారులు) విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న విధానాలే కారణం అని తెలుస్తుంది, అసలు సమస్య ఏంటంటే…

Reason-behind-US-Government-Shutdown

ప్రస్తుతం అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వాళ్లనే డ్రీమర్స్ అని పిలుస్తున్నారు, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమ వలసదారులకు లీగల్ స్టేటస్ కల్పించారు. వాళ్లను దేశం నుండి తరిమేయాలని ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ లో ఓ నిర్ణయం తీసుకోని డ్రీమర్స్ ను దేశం నుంచి పంపించేసి, దేశం చుట్టూ పటిష్టమైన సరిహద్దులను నిర్మించాలని ప్లాన్ చేసి, వాటి కోసం భారీగా నిధులను కేటాయించారు, కానీ డెమోక్రాట్లు మాత్రం ఆ డ్రీమర్స్ ని కాపాడాలనుకుంటున్నారు. ఈ విషయంలోనే డెమోక్రాట్లు – రిపబ్లికన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి, కానీ డెమోక్రాట్లు మాత్రం డ్రీమర్స్ గురించి పోరాటం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు డ్రీమర్స్ కి వ్యతిరేకంగా ఉండటంతోనే డెమొక్రాట్లు బిల్లు ఆమోదం పొందకుండా వ్యతిరేకంగా ఓటు వేశారు, ఈ విషయంలో కొంతమంది రిపబ్లికన్లు కూడా డెమొక్రాట్లకి మద్దతు తెలిపారు.

బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వం మూతపడే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాల్సి వస్తుంది. అత్యవసర సేవలు అయిన శాంతి భద్రతలు, వైద్యం, కొన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు మినహా మిగతా ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోనున్నాయి, ఈ సంక్షోభం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 40 రోజుల పాటు జీతం లేని సెలవులు ఇవ్వనున్నారు, మ్యూజియంలు, నేషనల్ పార్క్ లు, చారిత్రక ప్రదేశాలు మూతపడనున్నాయి, పాస్ పోర్ట్, వీసాల జారీ విషయంలో ఆంక్షలు ఉంటాయి, టూరిజం పై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇప్పటివరకు ఇలా అమెరికా ప్రభుత్వం 12 సార్లు మూతపడింది, ఈ షట్ డౌన్ కారణంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది, ఈ సంక్షోభం నుండి బైటపడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డెమొక్రాట్లతో చర్చలు జరుపుతున్నాడు.

Comments

comments