EDITION English తెలుగు
పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ   ఈ రోజు: 20-10-2018 (శనివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 19-10-2018 (శుక్రవారం ) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

దుబాయ్ నుండి శ్రీదేవి భౌతికకాయం తరలించడంలో ఆలస్యానికి అసలు కారణం !

Author:

దుబాయ్ లో పెళ్ళివేడుకలకని వెళ్లి ఆకస్మికంగా శ్రీదేవి మరణించిన విషయం తెలిసినదే. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 26) ముంబయి ఆమె స్వగృహానికి తీసుకువ‌స్తార‌ని అందరు ఎదురుచూసారు. ఆమె పార్థివదేహం ఎప్పుడెప్పుడు భారతదేశం వస్తుందా అని ఆమె కుటుంబసభ్యులు, వేలాది అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. భారత్ లోని అధికారులు దుబాయ్ వ‌ర్గాల‌కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారు. పెద్దలు రంగంలోకి దిగినా సొమవారం సాయంత్రానికి గాని ఆమె భౌతికకాయం భారత్ వచ్చే అవ‌కాశాల్లేవు.

sri2

దుబాయ్ కఠిన నిభందనలు, చట్టాల వల్ల ఈ ఆలస్యం జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. అక్కడ ఎవరూ చ‌ట్టాన్నిఉల్లంఘించి పని చేయరు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికకాయం అక్కడి స్థానిక పోలీస్ మార్చురీలో భద్రపరిచారు. ఫోర్సెనిక్ ప‌రీక్ష‌లు నిర్వహించిన తరువాతే ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తామని అక్క‌డి పోలీసులు చెప్పారు. నిన్నటికే ఆమె భౌతికకాయం రావలసి ఉండగా ఇతర వైద్య పరీక్షలు, పోస్ట్‌మార్టం అయ్యేసరికే కార్యాల‌య‌ వేళలు ముగియడంతో ఆలస్యం అయ్యింది.

sridevi

దుబాయ్ లొ చట్టప్రకారం ఎవరు మృతిచెందినా అక్కడి స్థానిక పోలీసులకి సమాచారం అందించాలి. అప్పుడు వారు మరణ సమాచారాన్ని నమోదు చేసి, ఆ మృతదేహాన్ని అల్ రాషేద్ లేదా అల్ ఖుసేస్ కి తరలిస్తారు. తరువాత ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం  వంటి పరీక్షలు నిర్వహించి మరణానికి గల కారణలు వివరిస్తూ నివేదిక సమర్పిస్తారు. మృతుల వీసా, పాస్ పొర్ట్ ధ్రువీకరించి క్లియ‌రెన్స్ సర్టిఫికేటును ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఎంబాల్మింగ్ మరియు ఎయిర్‌లైన్ అధికారులకి ఇస్తారు. వాటిని ఆస్పత్రిలో అందిస్తే వారు మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. దానిని వీసా వ్య‌వ‌హారాల శాఖ‌కు అందిస్తే వారు ఆ మృతుని వీసా రద్దుచేస్తారు. ఆ మరణ ధ్రువీకరణ పత్రాన్ని భారత్ ఎంబస్సీకి అందజేస్తే, కాన్సులేట్ ఎన్వోసీ జారీ చేస్తుంది. చివరకు అన్ని పత్రాలు అల్ మోహైసనా కేంద్రానికి అందించి, 1750 దిర్హాంలు చెల్లిస్తే ఎంబాల్మింగ్ చేస్తారు. ప్యాకింగ్ తరవాత 210 దిర్హాంలు అద్దెతీసుకొని దుబాయ్ విమానాశ్రయం కార్గో విభాగానికి తీసుకెళ్ళి అక్కడినుండి విమానంలో ఎక్కిస్తారు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 2,554 times, 4,249 visits today)