2 వేల 313 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

Author:

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో భారీగా ఉద్యోగ నియమాకాలకి నోటిఫికేషన్ జారీ చేసారు, మొత్తం 2313 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6 న నోటిఫికేషన్ విడుదల చేసారు, డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు, ఇప్పుడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవడానికి  చివరి తేది మార్చ్ 6 , 18 నుండి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

SBI-PO-Notification

ఈ ఉద్యోగాలకి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా అభ్యర్థులని వడ పోస్తారు, ఆ తరువాత ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు,  ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 2313  (1010-General, 606-OBC, 347-SC, 350-ST)

విద్యార్హత: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి  (ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే)

వయసు: 18 – 25

దరఖాస్తు తేదీలు: 07.02.2017 నుండి 06.03.2017

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి, www.sbi.co.in/careers/  అనే వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాలి.

పరీక్ష తేదీలు:

ప్రిలిమినరీ: ఏప్రిల్ 29 – 30, 2017, మే 6 – 7, 2017

మెయిన్:  జూన్ 4 , 2017

మరిన్ని వివరాలకి నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.

 

(Visited 3,536 times, 90 visits today)