శ్రీనివాస్ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’ లో జ్యో గా “రెజీనా”

Author:

Jo-Achuythandha poster

శ్రీనివాస్ అవసరాల మంచి నటుడే కాదు మంచి దర్శకుడు, తను మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమా మంచి రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తెచ్చుకుంది. ఇప్పుడు రెండవ సినిమాగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ మన ముదుకు ఇద్దరి అన్నదమ్ముల ప్రేమ కథను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా కీలకం అని, అందుకే చాలా రోజుల నుండి వెయిట్ చేసి చివరకు పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్య వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిన నటి ‘రెజీనా’ను ఓకే చేశాడట మన శ్రీనివాస్.
జ్యో అచ్యుతానంద సినిమాలో హీరోలు అన్నగా నారా రోహిత్, తమ్ముడిగా నాగ శౌర్య నటిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్, శ్రీనివాస్ అవసరాల ఇద్దరూ పలు సినిమాల్లో నటిస్తుండటం వల్ల ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణ్ కోడూరి సంగీతాన్ని అందించనున్నారు.

(Visited 219 times, 30 visits today)