EDITION English తెలుగు
పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ   ఈ రోజు: 20-10-2018 (శనివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 19-10-2018 (శుక్రవారం ) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

కారు లోన్ తో సినిమా తీసి అడ్డంగా బుక్కయ్యారు…

Author:

మన దేశంలో వరుసగా వివిధ బ్యాంకులలో జరుగుతున్న కుంభకోణాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి.  మొన్నటి విజయ్ మాల్య నుండి నిన్నటి నీరవ్ మోడీ వరకు పెద్ద పెద్ద తిమింగ‌ళాలు బ్యాంకులలో కొందరి అధికారులను మభ్యపెట్టి, మాయచేసి ఏదో ఒక విధంగా పెద్దమొత్తం లో కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని స్వాహ చేసి విదేశాలకి పారిపోయారు. ఇలాంటి సంఘటనలు ప్రజలకు బ్యాంకుల మీద  నమ్మకాన్ని పోగొడుతున్నాయి. ఇలాంటి సంఘటనే  SBI వేలచెరి, తమిళనాడు బ్రాంచ్ లో జరిగింది.

madaras

కొందరు యువకులు కారు కొనేందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో సుమారుగా రూ. ౩.౩౦ కోట్లు రుణం గా తీసుకున్నారు. కానీ వారు ఆ సొమ్ము తో ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాజా ను హీరో గా, మాళవిక మీనన్ ను హీరోయిన్‌గా పెట్టి  “అరవ సంద ” అనే సినిమా తీసి విడుదల కోసం సిద్దమయ్యారు. బ్యాంకుకు కట్టాల్సిన లోన్ సరిగా కట్టడంలేదని గుర్తించిన అధికారులకు నమ్మసఖ్యం కాని విషయాలు తెలిసాయి. మొదట ఇది లోన్ తీసుకున్నవారు చేసిన మోసంగా భావించిన వారికి ఇది ఇంటిదొంగల హస్తమున్నట్లుగా పసిగట్టారు. కాగా, వారికి గత సంవ‌త్స‌రం అక్టోబర్ లో డి.చిత్ర అనే ఆటో లోన్ మేనేజర్ ద్వారా ఆ సొమ్ము మంజూరు అయినట్టు అధికారుల‌కు దర్యాప్తులో తెలిసింది.

SBI-PAN

చిత్ర అధికార దుర్వినియగానికి పాల్పడినట్లు, బ్యాంకు లోన్ తీర్చే సాఫ్ట్ వేర్ ని కూడా హాక్ చేసినట్టు తేలడంతో బ్యాంకు అధికారులు ఆమెపై తదుపరి చర్యలకు సన్నద్దమయ్యారు.  బ్యాంకుని మోసం చేయడమే కాకుండా, లోన్ సొమ్ముని దుర్వినియోగ పరిచిన ఆ చిత్రబృందాన్ని అందులో నటించిన నటీనటులకి కోర్టు ద్వారా నోటీసులను అందచేసారు. లోన్ మనీ రికవరీ అయ్యేదాకా సినిమాని విడుదల చేయకూడదని, ఆడియో, వీడియో, శాటిలైట్ హక్కులను తమకే అప్పగించాలని బ్యాంకు కోర్టుని ఆశ్రయించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో..

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 375 visits today)