రిలయన్స్ కొత్త ఆఫర్: రూ.158లకే గ్యాస్ సిలిండర్లు.

Author:

జియో ఆఫర్ తో సంచనలం సృష్టించిన రిలయన్స్ కంపెనీ మరో సంచలన ఆఫర్ తో మన ముందుకు రాబోతుంది, త్వరలో వంట గ్యాస్ సిలిండర్ల రంగంలోకి అడుగుపెట్టనుంది, వంట గ్యాస్ అనేది నిత్యావసర వస్తువు, ఇప్పుడు ప్రతి గృహంలో వంట గ్యాస్ తప్పనిసరిగా వాడుతున్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద వంట గ్యాస్ సిలిండర్ ని సరఫరా చేస్తున్నాయి, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వంట గ్యాస్ సిలిండర్ లని అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన అవి సక్సెస్ కాలేదు.

Reliance-Gas-Cylinder

వంట గ్యాస్ సిలిండర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ని అందించాలనే ప్లాన్ లో రిలయన్స్ కంపెనీ ఉంది, ఈ ఆఫర్ లో భాగంగా మొదట రూ.158 కే 4 కిలోల గ్యాస్ సిలిండర్ ని మార్కెట్ లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు, ఇది సక్సెస్ అయితే మార్కెట్ లోకి డొమస్టిక్, కమర్షియల్ సిలిండర్లని కూడా తేవాలనే ప్లాన్ లో ఉంది, ఈ ఆఫర్ కనుక అమలులోకి వస్తే మరో సంచలనానికి రిలయన్స్ నాంది పలికినట్లే.

Also Read: గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఇలా చేయండి.

(Visited 3,709 times, 977 visits today)

Comments

comments