EDITION English తెలుగు
Home / Inspiring Stories / మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్దంతి నేడు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్దంతి నేడు.

Author:

Alluri Seetharamarajuఅల్లూరి సీతారామరాజు ఈ పేరు చెప్పాగానే మన రోమాలు నిక్కబోడుస్తాయి. కారణం అల్లూరి ఒక మహోజ్వల శక్తి. సీతారామరాజు నమ్మిన సిద్దాంతం ప్రాణాలర్పించైన పోరాటం ద్వారానే స్వతంత్రం తీసుకురావలనుకున్నడు. చివరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయాలేదు. సూర్య నారాయణమ్మ, వెంకట రామరాజులకు 1897 జూలై 4 జన్మించాడు.ఇతనికి ఒక తమ్ముడు, చెల్లి. చిన్నతనంలో తండ్రి మరణించడంతో చాలా కడు పేదరికం అనుభవించాడు. సీతారామరాజుకు చదువుపై అంత ఇష్టం లేకపోవడంతో చదువును మధ్యలోనే స్వస్తి పలికాడు. ఆ తర్వాత వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. కొద్ది రోజులు తునిలో కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ నిత్యం దైవ పూజ చేస్తూ గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు.

ఆ తర్వాత కొన్ని రోజులు ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. ఆ తర్వాత రెందవ యాత్ర బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలగు ప్రాంతాలలో సంచరించాడు.

ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పట్టణాలలోనే కాకుండా ఏజన్సీ ప్రాంతాలలో వారి దురాగాతలకు అంతు అడ్డు ఉండేది కాదు. వారి చేతిలో అమాయకమైన గిరిజనులు దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణంగా గురి అయ్యేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.

Alluri Seetharamaraju1

ఇదంత చూసిన రాజు మాన్యం ప్రజలో తిరుగుబాటు తీసుకురావాలని గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అలా కొద్ది రోజుల్లోనే మన్యం ప్రజలకు అన్ని యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని ఒక సైన్యంగా తాయారు చేశాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. మన్యం ప్రజలపై బాస్టియన్ అనే బ్రిటిష్ ఆధికారి అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ఈ ఆధికారి పై రాజు ఉన్నతధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకుపోగా రాజుపై ఆధికారి తప్పుడు కేసులు పెట్టి రాజుపై అందరిని కూడగట్టి విప్లవం తీసుకువస్తున్నాడని ఆరోపనలు చేయడంతో రాజుపై ఉన్నతధికారులు చాలా కోపంతో అతనినీ వారి ఆధినంలో ఉండేవిధంగా ఒక సపరేటు నిఘా రాజుపై పెట్టారు.

సీతారామరాజు విప్లవం మొదటిదశ:

సీతారామరాజు 150 మంది మన్యం సాహాస వీరులతో కలసి ఒక సైన్యాన్ని ఏర్పారిచారు. వారందరితో కలసి పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆ తర్వాత చింతపల్లి, కృష్ణదేవి పేట , రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం మొదలగు ప్రాంతాలలో వీరు దాడులు చేయాడంతో ఇతని సాహసాలను గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు. సీతారామరాజుని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది కానీ రాజు ఎప్పటికి అప్పుడు చాలా తెలివిగాతప్పించుకోనేవాడు. కానీ ఒక రోజు సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. దానిలో చాలా తీవ్రంగా పోరాటం చేసిన బ్రిటిష్ సైన్యం ముందు రాజు సైన్యం నిలువలేకపోయింది, దానితో రాజు వారి సైన్యం వెనుతిరిగిపోయారు.

సీతారామరాజు విప్లవం రెండవదశ:

మొదటిసారి రాజుగారి సైన్యానికి ఎదురు దెబ్బ తగలడంతో కొన్ని రోజులు రాజు సైన్యం అజ్ఞాతంలోకి వెళ్ళింది, బ్రిటిష్ అధికారి జాన్ ఛార్సీ నాయకత్వంలో ప్రభుత్వ సైన్యం రాజు సైన్యానికి చెందిన వారి పైన పెదగడ్డపాలెం వరిచేలలో ఫిరంగులతో కాల్పులు జరపడంతో సీతారామరాజు గారి అనుచరులు నలుగురు చనిపోయారు.ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం అజ్ఞాతంలో ఉండటంతో రాజుగారు చనిపోయారనే వార్త బ్రిటిష్ వారు ప్రచారం చేయాడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియడంతో ఎక్కడ పడితే అక్కడ రాజు కోసం గాలించడం ప్రారంబించారు. అందులో భాగంగా ఒక రోజు రాజు ముఖ్య అనుచరుడైన మల్లుదొర త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస అవడంతో పోలీసులకు దొరికితే ఎలాగో తనను విడిపించుకొచ్చారు ఆ తర్వాత ఒక రోజు మల్లు దోర ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా పోలిసులు దాడిచేసి నిర్బందించారు.

సీతారామరాజుని ఎదుర్కోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన్యంకు స్పెషల్ కలెక్టరుగా రూథర్‌ ఫర్డ్ ని నియమించింది. సీతారామరాజుని పట్టుకోవడం కోసం బ్రిటిష్ సైన్యం మన్యం ప్రజలని బాగా ఇబ్బంది పెట్టేవారు, ఈ విషయం తెలుసుకున్న సీతారామరాజు మన్యం ప్రజలని ఈ బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.ఒక రోజు ఒక పశువుల కాపరి ద్వారా తను లొంగిపోవటం కోసం తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. దానితో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రాజును చుట్టుముట్టి మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందిగా ఉన్న రాజును ఒక రోజు ఒక చెట్టుకు కట్టివేసి గుడాల్ సీతారామరాజుని కాల్చి చంపేశాడు..

(Visited 463 times, 74 visits today)