Home / Inspiring Stories / 360 ప్రాణాలను కాపాడి కనుమూసిన యువతి కథే “నీరజ”.

360 ప్రాణాలను కాపాడి కనుమూసిన యువతి కథే “నీరజ”.

Author:

Neeraja Bhanot Photos

1986 సెప్టెంబర్ 5న కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారతదేశం లోని ముంబై నుంచి వచ్చిన “ఫ్లైట్ 73” అనే పాన్అమ్ సంస్థకు చెందిన విమానం లాండ్ అయ్యింది మరికొద్ది నిమిషాల్లో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతూండగా లిబియా మద్దతు కలిగిన అబూ నిదాల్ సంస్థకు చెందిన నలుగురు హైజాకర్లు విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానం హైజాక్‌కు గురయిందన్న వార్త వినగానే ఫ్లైట్ సీనియర్ కేబిన్ క్రూగా ఉన్న నీరజ ఆ విషయాన్ని వెంటనే కాక్‌పిట్‌కు చేరవేసింది. కానీ ఫ్లైట్ హైజాక్ అనే మాట వినగానే అమెరికన్ జాతీయులైన విమానం పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ ముగ్గురూ తమ భాద్యతలనూ,ప్రయాణీకుల ప్రాణాలనూ వదిలేసి తాము మాత్రం తప్పించుకున్నారు. విమానాన్ని వదిలి పారిపోయారు.

Neeraja Bhanot Photos

దీంతో ఆ విమానంలోని 360 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడే బాధ్యత పానమ్ విమానంలో ఉండిపోయిన నీరజపైనే పడింది. పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ ఎవరూ లేని ఆ భారీ విమానంలో ప్రయాణికుల ప్రాణదాతగా 22 ఏళ్ల నీరజ తన బాథ్యతలను తక్షణం స్వీకరించింది. నీరజ ఇచ్చిన సూచనలతో ఆమెతో పాటు ఉన్న మిగతా సహాయ సిబ్బంది, హైజాకర్లు వెతుకుతున్న 41మంది అమెరికన్ ప్రయాణికుల పాస్‌పోర్టులను దాచి ఉంచే క్రమంలో సాటిలేని సాహస ప్రవృత్తిని ప్రదర్శించారు. అమెరికన్ ప్యాసింజర్ల పాస్‌పోర్టులు సేకరించి ఇవ్వమని ఉగ్రవాదులు ఆదేశిస్తే నిరజతో సహా విమాన సిబ్బంది వాటిని సీట్ల కింద, చెత్త క్యాన్‌లోనూ దాచి ఉంచి ఆ 41 ప్రయాణీకుల ప్రాణాలనూ కాపాడారు.వెతుకుతున్నట్టు నటిస్తూనే బయట ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఆలోచించుకునే సమయం దొరికేలా చేసారు. ఐతే అప్పటికీ కరాచీ ఎయిర్ పోట్ సెక్యూరిటీ అధికారులు ఏటువంటి సహాయ కార్యక్రమాలనూ చేపట్టనే లేదు.

దాదాపు 17 గంటల సేపు ఏవేవో కారణాలతో ఆమె హైజాకర్లను నిలువరించారు.ఎంతో అనుభవం ఉన్న ఫ్లైట్ అటెండెంట్లు కూడా తడబడే అటువంటి విపత్కర పరిస్థితిలోనూ రెండు పదుల వయసులో ఉన్న యువతి చాకచక్యంగా వ్యవహరించారు.దాదాపు 17 గంటల సంప్రదింపుల తర్వాత, ఓపిక నశించిన హైజాకర్లు విమానంలో కాల్పులు జరిపి, పేలుడు పదార్థాలను పేల్చినప్పుడు కూడా నీరజ అత్యవసర ద్వారాన్ని తెలిచి ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి దిగడంలో సహకరించారు.తన ప్రాణాలను కాపాడుకునే స్థితిలో ఉండి కూడా నీరజ తనున్న స్థానం నుంచి కదలకుండా ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డుకట్ట వేసింది.ఐతే అప్పటికే సహనం కోల్పోయిన హైజాకర్ల దాడి నుంచి ముగ్గురు పిల్లలను కాపాడే క్రమంలో వారి తూటాల బారిన పడి నీరజ కన్నుమూసింది.

Neeraja Bhanot Photos

మరో రెండురోజుల్లో తన 23 పుట్టిన రోజు జరుపుకోనున్న నీరజ మరణించింది. ప్రాణాలు పోయే పరిస్థితుల్లోనూ తన ఉధ్యోగ ధర్మాన్ని వదలని నీరజా భానోత్ తన ప్రాణాలు రక్షించుకోగల పరిస్థితిలో ఉండికూడా 360 మంది ప్రాణాలను ఉగ్రవాదుల దాడి నుంచి కాపాడింది. కన్నీళ్ళు తప్ప ఆమె త్యాగానికి ఏమీ ఇవ్వలేని ప్రయాణీ కులూ ప్రభుత్వాలూ అవార్డులతో ఆమె త్యాగానికి సలాం చేసాయి. భారత్‌తో పాటు, అమెరికా, ఐక్యరాజ్య సమితి, పాకిస్తాన్ తదితర దేశాలు మరణానంతర అవార్డులతో సత్కరించాయి. శాంతి కాలంలో ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను మరణానంతరం ప్రకటించే భారతీయ అత్యుత్తమ పతకం అశోక చక్ర అవార్డును ఆమెకి ప్రదానం చేశారు. నాటికీ, నేటికీ అశోక చక్ర అవార్డును పొందిన ఏకైక భారతీయ మహిళకా నిరజ చరిత్రలో నిలిచిపోయారు.

Neeraja Bhanot Photos

ఏవో కొన్ని సేవాకార్యక్రమాలలో కొద్దిసేపు పాల్గోనీ, స్వచ్చభారత్ లలో రోడ్లూడ్చీ పేపర్లలోనూ,టీవీల్లోనూ వచ్చే సెలెబ్రిటి వెనుక ఈ “హీరోయిన్ ఆఫ్ ది హైజాక్‌” నిజంగా నే హైజాక్ అయ్యి మరుగున పడిపోయారు. ఐతే ఇప్పుడు ఆమె జీవిత కథ, ఫ్లైట్లో ఆమె గడిపిన ఆ 17 గంటల ఉత్కఠ క్షణాలనూ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. నీరజా భానోత్‌ పాత్రధారిగా సోనమ్‌ నటిస్తోంది. రామ్‌మద్వానీ దర్శకత్వం వహించిన ఈచిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో సోనమ్‌ కపూర్‌తో పాటు సీనియర్‌ నటి షబానా అజ్మీ మరో ముఖ్యపాత్రలో నటించారు. నీరజ భానొత్ 360 మందిని మరో సారి కన్న తల్లి తన రక్తాన్నిచ్చి ఒకే సారి వందల మందికి ఊపిరిపోసిన మాత…. ఆమెకు నివాళిగా,ఒక గుర్తింపు గా వచ్చే సినిమా ఆమె త్యాగాన్ని మరోసారి గుర్తు చేయగలిగితే కావాల్సిందేముంది…

Must Read: దేశంలోనే నంబర్ వన్ సిటీ గా హైదరబాద్.

(Visited 2,342 times, 42 visits today)