EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Inspiring Stories / పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది…!

పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది…!

Author:

ఔను..!  సెప్టెంబరు 9, 1914 న పుట్టుక నీదే… నవంబరు 13, 2002 న చావూ నీదే…   కానీ…! గీ రెండిటి నడిమిట్ల నీబతుకంతా ఒక ప్రాంత ఆత్మ గౌరవానిదీ…

కాళోజీ…!

వందనాలు బాపూ…!

నీ యాదిలో….

కాళోజీ kaloji

పుటుక నీది

చావు నీది

బ్రతుకంతా దేశానిది

కాళోజీ kaloji

నేనంటే నేడు

నా గొడవంటే నాడు

నిజమో కాదోకల రుజువు

నీవు నేనూ వాడూ

నేనంటె నేటి మనస్థితి వైనం

నెనంటె భరత పౌరుడు

నా గొడవ ఆ పౌరుని స్థితి

నేనంటే ఒక వోటరు

నా గొడవ వోటేసేవాడు

నేనంటే తిరుగుబాటు దారు

నా గొడవ మన తిరుగుబాటు

కాళోజీ kaloji

సాగిపోవుటె బ్రతుకు

ఆగిపోవుటె చావు

సాగిపోదలచిన

ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు

సాగనే లేవెపుడు

వేచియుండిన పోను

నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు

త్రోసుకొని పోవలయు.

కాళోజీ kaloji

నా గొడవ నాది-అక్షరాల జీవనది

నానా భావనా నది- నీనా భావన లేనిది

మన భావన నది – సమ భావన నది

ఎద చించుక పారునది- ఎదలందున చేరునది

నా గొడవ నాది- కాళోజీ అనునది

కాళోజీ kaloji

దోపిడి చేసే ప్రాంతేతరులను

దూరం దాకా తన్ని తరుముతం

ప్రాంతం వాడే దోపిడి చేస్తే

ప్రాణంతోనే పాతర వేస్తం

కాళోజీ kaloji

నావారల చేరదీసి

నానా విధ బోధలతో

నాణ్యంగా నన్ను కొరిగి

నలుబదైదు సంతకాల

నాటకమాడిన నటుడా

నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల

గొంతోక్కటి గొడవొక్కటి

తెలంగాణ వెలిగి నిలిచి

ఫలించెలె భారతాన

భరత మాతాకీ జై

తెలంగాణ జిందాబాద్

కాళోజీ kaloji

దోస్తుగ ఉండే వారితొ మేమును

దోస్తే చేస్తం – ప్రాణమిస్తం

ఎంతకు అంత అన్న ధోరణితో

చింతమాని బ్రతుకును సాగిస్తం

కాళోజీ kaloji

1.”అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు

సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!”

2. తెలంగాణా భాషనెపుడు ఈసడించు భాషీయుల

సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు

కాళోజీ kaloji

అన్యాయాన్నెదిరిస్తే

నా గొడవకు సంతృప్తి

అన్యాయం అంతరిస్తే

నా గొడవకు ముక్తి ప్రాప్తి

అన్యాయాన్నెదిరించినోడు

నాకు ఆరాధ్యుడు

కాళోజీ kaloji

భాష కోసమో,యాస కోసమో ఈ రెండికీ మూలమైన అస్థిత్వం కోసమో ఎప్పటివో ఎందరివో కలల్ని తన రెండు కళ్లతో స్వప్నించిన కాళోజీ…! పుట్టుకా చావుల మధ్య బతుకంతా దేశానిదన్న కాళోజీ..!! ఈ రోజు యావత్ తెలంగాణా నిన్ను స్మరించుకుంటది నీ జయంతి ఈనాడు తెలంగాణా భాషా దినొత్సవం గా చెప్పుకుంటది.

జోహార్ కాళోజీ…! అని గుండెల నిండుగా నిన్ను తలుచుకుంటది…!

Comments

comments