Home / Inspiring Stories / 2015 సంవత్సరం లోనే 80% ఇంజినీరింగ్ పట్టభద్ర నిరుధ్యోగులు.

2015 సంవత్సరం లోనే 80% ఇంజినీరింగ్ పట్టభద్ర నిరుధ్యోగులు.

Author:

Engineering students

ఇంజినీరింగ్…నిరుద్యోగం ఈ రెండు పదాలకూ మనదేశంలో ఉన్నంత పాపులారిటీ మరెక్కడా లేదేమో. డాలర్ డబ్బుల వ్యామోహం ముందుగా ఇంజినీరింగ్ వైపు అడుగులేయించటం మొదలు పెట్టగానే కుప్పలు తెప్పలుగా ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టూకొచ్చాయ్ ఏటా లక్షల మంది గ్రాడ్యుఏట్లు తమ పట్టాలు పట్టుకొని బయటికి వస్తూనే ఉన్నారు. వచ్చాక???

ఉద్యోగం లేదు,ఉన్న ఉద్యోగానికీ చదివిన చదువుకూ పొంతన ఉండదు. అంత కష్టపడి లక్షల్లో ఫీజులు కట్టి మరీ ఇంజినీర్ అయ్యేది ఏదో ఒక పని చేసేందుకు కాదు కదా.. మరి ప్రతీ సంవత్సరం కాలేజీల నుంచి బయటకు వచ్చే ఇంజినీర్లకు నిరాశే ఎదురౌతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడదామనుకున్నా.. ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగమైనా చేద్దామనుకున్నా అవకాశాలు దొరకడం లేదు. నైపుణ్యం లేదనో.. ఇంగ్లిష్ రాదనో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఉద్యోగం పురుష లక్షణం అన్న నానుడికి ఎప్పుడో కాలం చెల్లింది. పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా ఉద్యోగం చేయూల్సిన బాధ్యత అందరిపైనా పడింది. అయితే, ఉద్యోగం దొరక్క.. స్వయం ఉపాధి పొందుదామంటే సాయం అందక నిరుద్యోగులు విలవిల్లాడిపోతున్నారు. చదువు‘కొన్న’ యువత పరిస్థితి అయితే మరీ దీనంగా మారింది.

బీ.టెక్,ఎం.టెక్ చదివి కూడా ఆర్.ఆర్.బీ,పోలీస్ కానిస్టేబుల్ ఉధ్యోగాలకు అప్లై చేసుకుని,కనీసం చిన్న అటెండర్ జాబ్ అయినా పర్లేదు గవర్నమెంట్ జాబ్ కదా అని రాజీ పడిపోతున్నారు. మన దేశ రాజధాని ఢిల్లీలో తాజా సెన్సెస్ లెక్కల ప్రకారం – 3,000 మందికి పైగా డిగ్రీ ఆపైన చదివిన విద్యార్థులు వీధుల్లో యాచిస్తున్నారు, ఈ విద్యార్థుల్లో సాంకేతిక విద్యార్థులు ఉండడం గమనార్హం. ఇందులో 745 మంది మహిళా విద్యార్థినులు కూడా ఉన్నారంటే నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. మరికొంత డిగ్రీ పైన చదువుకున్న మహిళలు మంది సెక్స్ వర్కర్లుగా మారుతున్నారంటే ఉపాధి కల్పించలేని మన విద్యా వ్యవస్థను, విద్యా విధానాన్ని తప్పు పట్టాల్సి ఉంది….

2015 లోనే 1,50,000 మంది ఇంజినీరింగ్ పట్టబద్రులు 650 కాలేజీల్లో తమ చదువుని పూర్తి చేసుకొని బయటకొచ్చారు. ఇప్పుడు వీరిలో 80%మంది ఖాళీగానే ఉంటూ ఉధ్యోగాల కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు. విదేశీ వీసాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేస్ రాష్ట్రంలోనీ అమ్రోహ్ లో స్థానికంగా స్వీపర్ పోస్టులకు ప్రభుత్వం నోతిఫికేషన్ జారీ చేసింది. మొత్త 114 ఉద్యోగాలకు గాను 14000 ధరఖాస్తులు వచ్చిపడ్డాయి. వీరిలో అత్యధికంగా బి టెక్ ఎంబిఏ గ్రాడ్యుయేట్ లు ధరఖాస్తు చేసారట..! ఎలాంటి విద్యార్హత లేని స్వీపర్ పోస్టులకు ఇంజినీరింగ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ లు ధరఖాస్తు చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎందుకనత డిమాండ్ అంటే జీతం నెలకు రూ 17000/- అని.

మన తెలుగు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి ఇంకా దారణంగా ఉంది, మన దగ్గర ఉన్నన్ని ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో మరెక్కడా లేవు, విద్యార్థులకు ఉద్యోగానికి సరిపోయే సరైన భోదన చెప్పకుండా, ప్రభుత్వం చెల్లించే ఫీజుల కోసమే నాణ్యత లేని అధ్యాపకులతో   కాలేజీలు నడిపిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా చాలా మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడం మన దగ్గర ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది.

ఇదీ ఇప్పుడు దేశంలోని ఇంజినీర్ల పరిస్థితి. సరైన బోదన ఉండదు 80%మార్కులు సర్టిఫికెట్ లో ఉన్నా ఇంగ్లిష్ రాదు. నాణ్యత లేని విధ్యాబోదన, సరైన అవగాహనా లేకుండా కేవల ఇంజినీరింగ్ మాత్రమే సంపాదనా మార్గం గా బ్రమ పడటం ఇంజినీరింగ్ నిరుధ్యోగులని పెంచుతూనే ఉన్నాయి.

(Visited 421 times, 14 visits today)