EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / health / ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే బీరకాయ

ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే బీరకాయ

Author:

బీరకాయ తినటం వల్ల ఆరోగ్యానికి జరిగే ప్రయోజనాల గురించి మీకు తెలిసినట్లైతే, వారంలో ఎక్కువ సార్లు బీరకాయ కూరనే తినటానికి ఇష్టపడతారు. సహజంగా నోటికి బాగా రుచి అందించే కూరగాయల్లో బీరకాయ ముందు వరసలో ఉంటుంది. సాధారణ, నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌… వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలా వరకు తగ్గించేందుకు తోడ్పడతాయి.

ridge-gourd-benefits-for-health

బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మందుబాబుల తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ పరిశోధనల్లో తేలింది. అల్సర్లూ, మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. అంతేగాకుండా బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Comments

comments