Home / Entertainment / జబర్దస్త్ షో నుండి రోజా అవుట్.

జబర్దస్త్ షో నుండి రోజా అవుట్.

Author:

Jabardasth-Roja

ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. రేటింగ్స్ ప‌రంగా అట్ట‌ర్‌ప్లాప్ అయిన ఈ టీవీకి జ‌బ‌ర్త‌స్త్ కార్య‌క్ర‌మం కొత్త ఊపిరిలూద‌డంతో పాటు రేటింగ్స్‌లోను టాప్ పొజిష‌న్‌కు తీసుకెళ్లింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో మంది కామెడీ ఆర్టిస్టులు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అలాగే జ‌బ‌ర్ద‌స్త్‌లో అడ‌ల్ట్ కామెడీపై కూడా భారీగా విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.. ఈ షోకి మెగా బ్రదర్ నాగబాబు, అలనాటి హీరోయిన్, ప్రస్తుత ఎమ్మెల్యే రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. స్టేజ్‌ మీద ఆర్టిస్ట్‌లతో సమానంగా వీరిద్దరూ పంచ్‌లు విసురుతూ షోకి అందాన్ని..క్రేజ్‌ని తీసుకొచ్చారు. అయితే ఈ జంటను విడదీసేందుకు రంగం సిద్ధమవుతుందని టాక్. రోజాని తప్పించాలని ప్రోడ్యూసర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. అయితే త్వరలో రోజా ఇక ఈ షో లో కనిపించదని వినపడుతోంది. ఈ మేరకు ఈ షో నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ,మీడియాలోనూ ప్రచారమౌతోంది….

రోజా తీరుపై గత కొంతకాలంగా అసహనంతో ఉన్న టీడీపీ వర్గాలు ఆమెను ఈ షో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నాయని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకొ వార్త ఏమిటంటే రోజా అసెంబ్లీలో టీడీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే వారు ముందుగా జ‌బ‌ర్ద‌స్త్‌లో రోజా వ్య‌వ‌హార శైలీని, ఆ బూతు షోకు యాంక‌ర్‌గా ఉన్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా రోజా శైలి ప‌ట్ల అసంతృప్తితోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో రోజా స్వ‌చ్ఛందంగానే జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.

నిజానికి గత కొంతకాలంగా ఈ షో పాపులారిటీని కోల్పోతోంది ఇది వరకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. మరికొన్ని ఇదే తరహా కార్యక్రమాలు మొదలవటమూ, కంటెంట్ రిపీట్ అవటమే కారణం అంటున్నారు. ఈ పోగ్రామ్ ని నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి చెందిన మల్లెమాల ప్రొడక్షన్స్ రోజాని తప్పించే విషయమై గత కొంతకాలంగా ఛానెల్ వారితో సైతం మాట్లాడుతున్నారని, త్వరలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. నిజానికి నాగబాబు, రోజా చాలా కాలం నుంచి ఈ పోగ్రామ్ లో కంటిన్యూ అవటంతో పోగ్రామ్ కు ఉండాల్సిన ఛామ్ కూడా కోల్పోయిందని , షో కు ప్రత్యేకంగా వీరి వల్ల ఒరిగేదేమీ కనపడటం లేదని అంటున్నారు. పోగ్రామ్ టీఆర్పిలు సైతం తగ్గిన ఈ సమయంలో కొత్త నీరుతో ఈ పోగ్రామ్ ని పాతపడకుండా చేయాలని ఛానెల్ వారు , పోగ్రామ్ డిజైనర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రోజా స్ధానంలో రమ్యకృష్ణ ను కానీ, మీనాని కాని తీసుకోవాలని కార్యక్రమం నిర్వాహకులు భావిస్తున్నారట. పారితోషకం కూడా ఎక్కువగానే ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇందులో చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రోజా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 6 లక్షల వరకు చార్జ్ చేస్తోందని సమాచారం. అయితే ఈ సారి ఈ పారితోషికం మొత్తాన్ని కూడా పెంచుతున్నట్టు సమాచారం… మరి రోజా స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారో వేచి చూడాలి.

(Visited 4,249 times, 54 visits today)