Home / Entertainment / బ్రహ్మొత్సవం ఆగదు.

బ్రహ్మొత్సవం ఆగదు.

Author:

Mahesh Babu Next Movie Bramhostvam

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవంపై ఇటీవల కాలంలో అనేక పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం వన్ లైనర్ నచ్చిందని.. కాని, శ్రీకాంత్ స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే సినిమా వాయిదా పడుతూ వస్తున్నదని వార్తలు వచ్చాయి. రెండో రోజుల క్రితం ఏకంగా బ్రహ్మోత్సవం ఆగిపోయిందనే కధనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హార్ట్ టచింగ్ గా ఉండేలా చూడమని మహేష్ చెప్పడం తో బ్రహ్మోత్సవం షూటింగ్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినట్లు గా వచ్చిన వార్తల్లొ ఎంత నిజమో తెలియదు గానీ అవన్నీ గాలి వార్తలేనని యూనిట్ సభ్యులంటున్నారు…

బ్రహ్మోత్సవం షూటింగ్ షెడ్యూల్స్ పై నెలకొన్న అనుమానాలకు చెక్ పెట్టేందుకు ఇలా దర్శకనిర్మాతల పేరుతో ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. మొత్తానికి రూమర్స్ ను ఖండించేందుకు స్పీడ్ గానే రియాక్ట్ అయ్యారు బ్రహ్మోత్సవం యూనిట్. సో.. మహేష్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. మొన్నటికి మొన్న యువహీరో అఖిల్ సినిమా వాయిదా విషయంలో అభిమానుల ఆగ్రహాన్ని చూసిన “బ్రహ్మోత్సవం” టీం తమ విషయంలోనూ అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని భావిస్తూన్నట్టుంది. అందుకే తొందరగానే ఈ పుకార్లకు చెక్ పెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి కాగా.. ఇప్పుడు మూడో షెడ్యూల్ ను ఈ నెల 28 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించనున్నారట. మూడో షెడ్యూల్ ను డిసెంబర్-9 వరకూ పూర్తిచేసి 10వ తేదీ నుంచి ఊటీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. మహేష్ తో పాటు చిత్ర నటీనటులందరూ ఊటీ షెడ్యూల్ లో జాయిన్ అవుతారట. “శ్రీమంతుడు సాధించిన సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఇప్పుడు బ్రహ్మ్మొత్సవం విషయంలో కూడా అదే స్థాయి హిట్ ని కోరుకుంటున్నడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. పీవిపీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవం విడుదల అవుతుందని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.

(Visited 164 times, 3 visits today)