EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / సినిమా రివ్యూ : RX 100

సినిమా రివ్యూ : RX 100

RX 100 review

అర్జున్‌ రెడ్డి సినిమా తరువాత టాలీవుడ్‌లో రొటీన్ కి భిన్నంగా బోల్డ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదే జానర్‌లో తెరకెక్కిన కొత్త సినిమా RX 100. సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ డిఫరెంట్‌గా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిత్ర యూనిట్‌ రొటీన్‌ సినిమాలు చూడాలనుకునేవారు మా సినిమాకు రావొద్దంటూ ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన RX 100 అంచనాలు అందుకుందా..? రొటిన్‌ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుందా..తెలుసుకోండి..!

కథ:

చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ. ఊళ్లో గొడవల కారణంగా డాడీకి , విశ్వనాథం(రావు రమేష్)తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్‌)తో ప్రేమ పడతాడు. తన ప్రేమకు డాడీ సపోర్ట్ చేయటంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఒక రోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పి వెళ్లిన ఇందు, ఆ తరువాత శివకి దూరం అవుతుంది, ఇందు దూరం అవ్వడంతో శివ, ఇందు కుటుంబంపై పగ పెంచుకుంటాడు, చివరికి ఇందు, శివ కి దగ్గరైందా..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

దర్శకుడు అజయ్‌ భూపతి.. అర్జున్‌ రెడ్డి సినిమాను దృష్టిలో పెట్టుకొని అలాంటి బోల్డ్‌ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. అయితే తను అనుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో మాత్రం కొంచెం ఫెయిల్‌ అయ్యాడు. RX 100 టైటిల్‌ కోసం ఎంతో కష్టపడి సాధించానని చెప్పిన దర్శకుడు అసలు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాడో అర్థంకాలేదు. కేవలం హీరో RX 100 బండి వాడటం తప్ప కథతో టైటిల్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమను చూపించే కన్నా సినిమాను బోల్డ్‌ గా తెరకెక్కించాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా తెరకెక్కించే ఆలోచనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కన పెట్టేశారు. కథనంలో వేగం లోపించటం కూడా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. చైతన్య భరద్వాజ్‌ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. స్మరన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సందర్భాల్లో కథకు అవసరం లేని సన్నివేశాలు వచ్చిపోవటం ఇబ్బంది పెడుతుంది.

ప్లస్ పాయింట్స్‌ ;

  • హీరో పాత్ర
  • కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌;

  • స్లో నేరేషన్‌
  • హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్‌

                                           పంచ్ లైన్: RX 100 మరో అర్జున్ రెడ్డి అయితే కాదు..!

(Visited 1 times, 443 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]