EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

గూగుల్, ఫేస్‌బుక్ లను తలదన్నే ఆలోచన చేసిన ఇండియన్ కంపెనీ.

Author:

Modem2

ఇంటెర్నెట్ మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది కానీ భారతదేశంలో ఇంకా చాలా మారుమూల పల్లెలు ఇంటెర్నెట్ అనే పేరు కూడా వినలేదు. అందుకోసమే ప్రధానమంత్రి మోడి డిజిటల్ ఇండియా అనే ఒక పథకం కూడా ప్రారంభించాడు. అయిన దాని ఫలాలు ఇంకా అన్ని గ్రామాలకు చేరలేదు. మారుమూల ప్రాంతాలకు ఇంటెర్నెట్ అందించేందుకు మహా మహా సంస్థలే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో గూగుల్ సంస్థ ఐతే ఏకంగా 2013లో లూన్ అనే ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టి ఆకాశంలోకి పెద్ద పెద్ద బలూన్లని పంపి వాటి ద్వారా ఇంటెర్నెట్ ఇచ్చే ప్రయోగాలు చేసింది. ఫేస్‌బుక్ ఐతే ఇంకో అడుగు ముందుకేసి తమ అక్విలా ప్రోగ్రామ్ ద్వారా సౌర శక్తితో నడిచే విమానాలు తయారుచేయించి వాటిని మారుమూల ప్రాంతాలకి పంపి ఇంటెర్నెట్ అందించే ప్రయోగాలు చేసింది. కానీ ఈ ప్రయొగాలన్ని చాలా ఖర్చుతో కూడుకున్నవి. అవి ఏమాత్రం సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండవన్నది జగమెరిగిన సత్యం.

Modem

దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న బెంగుళూరుకి చెందిన సాంఖ్య లాబ్స్ అనే సంస్థ చాలా ప్రయోగాలు చేసి చివరికి విజయం సాదించింది.  తెలివిగా ఆలోచించి పృథ్వి అనే పేరుతో ఒక చిన్న మైక్రో చిప్ ని కనిపెట్టింది. ఈ చిప్ మరియు వారు కనిపెట్టిన మెగాధూత్ టెక్నీక్ తో నిరుపయోగంగా ఉన్న టీవీ యాంటీనా సిగ్నల్స్ ని ఇంటెర్నెట్ గా మార్చవచ్చు. అంటే ఎంత మారుమూల గ్రామం అయిన సరే ఒక పెద్ద టీవీ యాంటీనాతో వీరు తయారు చేసిన బేస్ స్టేషన్ తో చుట్టుపక్కల 20 నుంచి 30 కిలోమీటర్ ల పరిధిలో అందరికి ఇంటెర్నెట్ అందించవచ్చు. ఒక్కొక్క బేస్ స్టేషన్ కి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువట, ఈ ప్రయోగం ఫలిస్తే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యాన్ని సులభంగా సాదించవచ్చు. కోటానుకోట్లూ పెట్టి గూగుల్, ఫేస్‌బుక్ లు తయారుచేస్తున్న అతి ఖరీదైన వస్తువులు కోనాల్సిన అవసరమూ లేదు.

Must Read: ఆధార్ కార్డులు లామినేషన్ చేయించొద్దు…! అవి చెల్లవు…!

(Visited 17,077 times, 1,585 visits today)

Comments

comments