EDITION English తెలుగు
Home / Entertainment / సింగల్ డైలాగ్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు.

సింగల్ డైలాగ్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు.

Author:

అతడికి మామూలు తెలుగు హీరోకి ఉండాల్సిన ఈ ఒక్క లక్షణమూ లేదు, ఒడ్డూ, పొడుగూ ఉండడు, అందగాడూ కాదూ, సిక్స్ పాక్ బాడీ అయినా లేదు, డాన్సులు ఇరగాదీయనూ లేదు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్, “హృదయ కాలేయం” అనే ఓ పేరడి సినిమాతో వచ్చి ఓ స్టార్ హీరో కొడుకులా అసలు సినిమా రిలీజ్ అవ్వక ముందే రాజమౌళి పోస్ట్ దయవల్ల ఫాన్స్ ని బాగానే వెనకేసుకున్నాడు. సదా మీ ప్రేమకి బానిస మీ సంపూని అంటూ జనాలకి సెంటిమెంట్ మీద ఎంటర్టైన్మెంట్ పోసి బాగానే దగ్గర అయ్యాడు.

మొదటి సినిమా తర్వాత మంచు వారి బ్యానర్ లో సింగం123 పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరడీ చేసి ఏదో ఆ సినిమాని అలా అలా లాగించేసాడు, అంతే కాదండోయ్ మధ్య మధ్యలో కొన్ని సినిమాలలో అతిధి పాత్రలో కూడా కనిపిచాడు, కరెంటు తీగలో అయితే ఏకంగా సన్నీలియోన్ కి భర్తగా కనిపించాడు.

Kobbari Matta Teaser Super response

అయితే ఈ సారి హృదయ కాలేయ టీం తోనే కొబ్బరిమట్ట అని వస్తున్నాడు. మొన్ననే విడుదల అయిన టీజర్ కి రెస్పాన్స్ మామూలుగా లేదు. నెట్ లో అలా అప్ లోడ్ చేసారో లేదో గంటల్లో లక్షల వ్యూస్, ఈ సినిమాలో సంపూ మొత్తం 3 పాత్రలు చేయబోతున్నాడు పాపారాయుడు, పెదరాయుడు , ఆండ్రాయుడు గా కనిపించబోతున్నాడు, కాగా రిలీజ్ అయిన టీజర్ లో పెదరాయుడు గా కనపడుతూ తనదైన స్టైల్ లో గుక్కతిప్పుకోకుండా నిమషం పైగానే పేరడితో చెప్పి సంపూ నిజంగానే ఇరగదీసాడు. ఇక సంపూ ఫాన్స్ ఆగుతారా చెప్పండి … బర్నింగ్ స్టార్ సంపు టీజర్ కి షేర్లే షేర్లు . టీజర్ లోనే ఈ రేంజ్ లో ఇరగదీసిన సంపూ ఇక సినిమాలో 3 పాత్రలు ఎలా చేసాడో అని అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ సంపూ ని 3 పాత్రల్లో చూడాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి …

(Visited 1,714 times, 28 visits today)