Home / Entertainment / ‘బెంగాల్ టైగర్’ గర్జిస్తుంది: సంపత్ నంది

‘బెంగాల్ టైగర్’ గర్జిస్తుంది: సంపత్ నంది

Author:

bengaltiger

ఉన్నత చదువులు చదివిన సినిమా మీద ఉన్న ప్రేమతో హైదరబాద్ వచ్చి పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరి తర్వాత డైరెక్టర్ గా ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది. పవణ్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2′ చిత్రానికి తొలుత దర్శకుడిగా ఎంపికైన సంపత్ నంది అనుకోని కారణాలతో తర్వాత ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అన్న సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.  స్టైల్, మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 10న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ‘బెంగాల్ టైగర్’ యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిన్న హైద్రాబాద్‌లో ‘బెంగాల్ టైగర్’ ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణమంతా పాల్గొని సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. “నా కెరీర్ అస్తవ్యస్థమైన ఈ సమయంలో రవితేజ గారు మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చి ప్రోత్సాహించారు. బెంగాల్ టైగర్ అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా. ఈ నెలాఖర్లో క్రిస్‌మస్ పండగ, వచ్చే నెలలో సంక్రాంతి, ఇలా అన్ని పండగల కంటే ముందే వస్తోన్న మన పండగే ‘బెంగాల్ టైగర్’. బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాగా బెంగాల్ టైగర్ నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అని తెలిపారు. రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు.

(Visited 95 times, 5 visits today)