Home / Entertainment / సర్దార్ సినిమా టికెట్ కోసం ఇళ్ళు అమ్ముకున్నాడట.

సర్దార్ సినిమా టికెట్ కోసం ఇళ్ళు అమ్ముకున్నాడట.

Author:

Sardaar Gabbar Singh

పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ పవన్ సినిమా అంటే కేవలం పవన్ ఒక్కడి భుజమ్మీదే జయాపజయాలు ఆధారపడి ఉంటాయ్.. పవన్ ఉంటే చాలు ఆ సినిమాని క్రేజీ ప్రాజెక్ట్ గా చూస్తూంటారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే సినిమా రైట్స్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రైట్స్ దక్కించుకున్న వారిలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ క్రాంతి రెడ్డి ఒకరు. ఈయన సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాదు… మెగా ఫ్యామిలీకి నమ్మకమైన వ్యక్తి. చిరంజీవి రోజుల నుండే ఆయన మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ వస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం పోటీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ క్రాంతి రెడ్డికే రైట్స్ అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఆఫర్ చేసారనే కారణంగానే…. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసారు క్రాంతి రెడ్డి. ఇదే విషయమై ఆయన్ను కొందరు ప్రశ్నిస్తే…’ఈ సినిమా వల్ల నేను లాభ పడొచ్చు…లేదా కోటి లేదా రెండు కోట్లు లాస్ కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కోసం లాభమైనా, నష్టమైనా భరించడానికి నేను సిద్దమే’ అని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.

మామూలుగానే పవన్ కళ్యాన్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉంటారు..ఇక రెండు సంత్సరాల తర్వాత పవన్ వెండితెరపై కనిపిస్తున్నాడని తెలిస్తే..ఆ సినిమా కోసం ఎన్నికష్టాలైన పడి ఫస్ట్ షో చూసి తీరాలనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాన్ సర్ధార్ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది..బ్లాక్ లో అమ్మేవారు బాగా సొమ్ము చేసుకోవడానికి తయారౌతున్నారు. ఇక విదేశాల్లో అయితే తమ అభిమాన హీరోల కోసం ఎంతైనా వెచ్చించి టిక్కెట్టు కొని చూడటం మనం చూస్తూనే ఉన్నాం.బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది..దీనికోసం అభిమానులు టిక్కెట్ల కోసం ఇప్పటికే యుద్దాలు మొదలు పెట్టారు..ఇక కర్పూల్ జిల్లాలో ఓ అభిమాని తన అభిమాన హీరోకోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టిక్కెట్లు కొన్నాడట… చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఈయనకి పిచ్చా అని ఆశ్చర్య పోతూంటే….. ఇతగాడు మాత్రం సినిమా కోసం ఎదురు చూస్తూ పవన్ కళ్యాణ్ పోస్టర్లూ,సర్దార్ గబ్బర్ సింగ్ ప్రోమోలూ చూస్తున్నాడట…

(Visited 802 times, 23 visits today)