Home / Entertainment / సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Sardaar-Gabbar-Singh-Perfect-Review-and-Rating

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది.గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా , ఎక్కడ విన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది , గోపాలా గోపాలా లాంటి హిట్స్ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉగాది పండుగ కంటే ఘనం గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గ‌త రెండు మూడేళ్ల‌లోనే ప‌వ‌న్ ఇమేజ్ పీక్స్ స్టేజ్‌కు పెరిగిపోవ‌డంతో పాటు 2012 లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్‌ కు కొన‌సాగింపుగా తెర‌కెక్కిన స‌ర్దార్‌పై లెక్క‌కు మించి అంచ‌నాలు ఉన్నాయి.. మరి పవన్ కళ్యాణ్ సర్దార్ గా ఎంతవర్కూ సక్సెస్ అయ్యాడు? సర్దర్ గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందీ అనేది చూద్దాం…

క‌థ:

కథ మన రాష్ట్రంలో జరిగింది కాదు రతన్ పూర్ లో సాగుతుందీ కథ, తమకున్న దానిని ప్రజలకు పంచిపెట్టే రాజ కుటుంబం రథన్ పూర్ సంస్థానాన్ని పాలిస్తూంటుంది. మరో పక్క జనాలను అష్టకష్టాల పాలు చేసి వారి నోటి దగ్గర కూడు లాక్కునే క్రూర స్వభావం గల రాజు భైరవ్ సింగ్ (శ‌ర‌ద్‌కేల్క‌ర్‌) ర‌తన్‌పూర్ రాజ వంశీకుడు. మైనింగ్ కోసం ల‌క్ష్మాపూర్ అనే విలేజ్‌ను మాయం చేస్తాడు. ర‌త‌న్‌పూర్ సంస్థానాన్ని త‌న గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తుంటాడు. ర‌త‌న్‌పూర్ సంస్థానం బాధ్య‌త‌లు తన చేతుల్లోకి తీసుకొని హ‌రినారాయ‌ణ్‌(ముఖేష్‌రుషి) రాజ‌కుమారి అర్షిణి దేవి (కాజ‌ల్‌) ప‌ర్య‌వేక్ష‌ణ చూస్తుంటాడు..ఈ రెండుకుంటుంబాల మధ్య పేదరికం లో బతుకుతూంటారు రతన్ పూర్ వాసులు. అక్షిదేవి (కాజల్ అగర్వాల్) తల్లి తండ్రుల మ‌ర‌ణం త‌రువాత త‌మ‌నే న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం త‌ల్లితండ్రుల ఆశ‌యాల‌కోసం త‌న ఆస్తుల‌ను అమ్ముకుంటూ త‌న సామ్రాజ్యాన్ని ఒక్కొక్క‌టిగా కోల్పోతున్న యువ‌రాణి ఆ దుష్ట రాజు నుంచి ప్రజలను, తననీ ఎవరు కాపాడుతారా అన్న సమయంలో హైదరాబాద్ నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యి రతన్ పూర్ కి సిఐ గా వస్తాడు సర్ధార్ గబ్బర్ సింగ్. అయితే భైర‌వ్ సింగ్ క‌న్ను అర్షిణి దేవిపై ప‌డుతుంది. అప్ప‌టికే పెళ్లైన భైర‌వ్ సింగ్ అర్షిణి దేవిని మ‌రో పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే హైద‌రాబాద్‌లో కోబ్రాగాంగ్ తాట తీసే గ‌బ్బ‌ర్‌సింగ్‌కు రతన్ పూర్ స‌డ‌న్ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అక్క‌డ‌కి ఎంట్రీ ఇచ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ అల్ల‌రి చిల్ల‌రిగా ఉంటూ అక్కడి సమస్యల్ని ఎలా ఎదుర్కుంటాడు. అర్షిణి దేవి ప్రేమలో ఎలా పడతాడు.. భైరవ్ సింగ్‌కు ఎలా చుక్కలు చూపించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే….

అలజడి విశ్లేషణ:

ముందుగా సినిమా చూస్తున్నంత‌సేపు ప‌వ‌న్ త‌ప్ప మ‌రేవి క‌న‌ప‌డ‌క‌పోవ‌టం విశేషం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న భారీ తారాగణం అంతా సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కనిపిస్తారు. అయితే సినిమా స్క్రీన్ పై హీరో, హీరోయిన్ మరియు విలన్ మాత్రమే కనిపిస్తారు. అలాంటపుడు ఇంత భారీ తారగణాన్ని ఎందుకు తీసుకున్నారో అర్ధం కాని విషయం. సినిమా మొత్తం ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో చూపించాడు.కొన్ని సార్లైతే కేవలం అభిమానుల కోసమే ఈ సినిమా తీసుకున్నారేమో అనిపిస్తుంది. కథ-మాటలు-కథనం ఇవన్నీ ఒక ఎత్తైతే సింగిల్ గా పవన్ కళ్యాన్ ఒక్కడే ఒకెత్తు.ఒక రకంగా సర్దార్ హిట్ అయ్యినా ఫ్లాప్ అయినా పవన్ కి ఏమాత్రం నష్టం లేదు.ఎందుకంటే సర్దార్ గా పవన్ ఎప్పుడో హిట్ అయిపోయారు.. పవన్ కళ్యాన్ లో ఉన్న నటుడికి అవకాశం కల్పించే సన్నివేశం కాకుండా పవన్ కళ్యాన్ ఒక ప్రజా నాయకుడు, ఒక అతీత శక్తి అనిపించే విధంగా మరీ అతిశయోక్తిగా అనిపించే సన్నివేశాలు,అక్కడక్కడా మాస్ హీరోఇజం కనిపించే సన్నివేశాలతో తో బావుందిలే అనిపించే సినిమాని.ద్వితీయార్ధంలో కథకు ఇబ్బంది పెట్టే అర్ధం లేని సీన్లతో నింపేయడం చూస్తే మాత్రం పవన్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది గానీ లేకుంటేనా అనిపిస్తుంది…. ఒక పక్క సీరియస్ గా ఉంటూనే సిల్లీ పనులూ చేసి కూడా హీరో క్యారెక్టర్ ని నడిపించటం పవన్ కే సాధ్యం..

కథ పాతదే…కథనమూ కొత్తదేం కాదు. కష్టాల్లో ఉన్న ఒక గ్రామాన్ని ఒక పోలీసాఫీసర్ వచ్చి కాపడటం అనేది ప్రతీ 5 ఏళ్ళకొకసారి హిట్ కొట్టే ఫార్ములా. ఇదే రొడ్డకొట్టుడు కథని తీస్కొని పవన్ ఉంటే చూసేస్తారు అన్నట్టు గా తీసిపారేశాడు దర్శకుడు కె.ఎస్.రవింధ్ర. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ లో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ హీరోని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడే సీన్లు, ఫైట్లు, రొమాన్స్ ఇవి చూస్తున్నంత సేపు బావున్నాయి.అయితే అన్నీ కలిపి చూస్తే మాత్రం కంగాళీగానే అనిపిస్తుంది… జబర్ధస్త్ టీమ్ మొత్తం ఉన్న సినిమాలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చెప్పుకోదగిన సన్నివేశం లేదు.అందరూ నామమాత్రంగానే మిగిలిపోయారు ఇక రావు రమేష్ క్యారెక్టర్ మరీ ఘోరం..ఎప్పుడేం మాట్లడుతాడో అస్సలు అర్ధం కాదు. క్లయిమాక్స్ ముందు అంతా భారీ లెవల్లోకి తీసుకెళ్లి 75 కోట్లు పెట్టి తీసిన సినిమాని కేవలం ఉండాలి కాబట్టి ఫైట్ అన్న విధంగా ఎందుకు ముగించారో అర్థం కాదు.

నటీ నటుల ప్రతిభ:

సర్ర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ది వ‌న్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. సినిమాలో ప‌వ‌న్ స్టైల్స్‌ , డైలాగ్స్‌ , డ్యాన్స్‌ , లుక్స్‌ , రొమాన్స్ , కామెడీ , యాక్ష‌న్‌ ఇలా చెప్పుకుంటే పోతే అన్ని ర‌సాలు పండించేశాడు. ప‌వ‌న్ యాక్టింగ్ అల్టిమేట్ గా ఉంది. కాజ‌ల్‌తో రొమాంటిక్ సీన్ల‌లో ప‌వ‌న్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనబరిచాడు . ఇక యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌న‌కు అల‌వాటైన స్టైల్లోనే గ‌న్ తిప్పుతూ సినిమాని షేక్ ఆడించాడు. బ్ర‌హ్మీ-ప‌వ‌న్ మ‌ధ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్లు కూడా చాల బాగున్నాయి .

రాకుమారి పాత్ర‌లో కాజ‌ల్ అగర్వాల్ అద్భుతంగా న‌టించింది.ఒక కథానాయిక రాకుమారి వేషం వేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా తూచినట్లు అలాగే చేయగలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. గతంలో మగధీర నుండి నేటి సర్ధార్ గబ్బర్ సింగ్ వరకు నటనలో కాజల్ తన కెరీయర్ బెస్ట్ ఈ సినిమాకు ఇచ్చింది. ప‌వ‌న్‌తో ప్రేమ స‌న్నివేశాల్లో ఇద్దరి మ‌ధ్య కెమిస్ర్టీ చ‌క్క‌గా కుదిరింది. ఇక మిగిలిన వాళ్ల‌లో విల‌న్ శ‌ర‌ద్ కేల్క‌ర్ రాజ‌వంశానికి చెందిన స్టైలీష్ విల‌న్‌గా న‌టించాడు. కేవ‌లం త‌న లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌తోనే విల‌నిజం పండిచాడు. రాజా భైరవ్ సింగ్ గా రాజదర్భం వెళ్లబోస్తూనే జనాలను కర్కశంగా ఇబ్బంది పెట్టే క్రూరుడిగా శరద్ నటన అద్భుతంగా ఉంది. ఇంత మంచి విలన్ క్యారెక్టర్ చేసిన శరద్ ఇంట్రవెల్ తర్వాత నుంచి ఏదో ఉన్నానంటే ఉన్నానంటూ తను చేయడానికి ఎక్కువ స్కోపు లేదు.

ఇక పోసాని, ముఖేష్ రిషి, రావు రమేష్, బ్రహ్మనందం,ఆలి, తనికెళ్ల భరణి ఇలా ఇండస్ట్రీ లోని భారీ తారాగణం స్క్రీన్ పై అలా వస్తూ ఇలా వెళ్లిపోయారు..కొంత మందికి అసలు డైలాగులే లేవు. ఆలీతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ గ్యాంగ్ ప‌వ‌న్ ప‌క్క‌నే ఉండే పోలీస్ గ్యాంగ్‌గా మ‌స్తు కామెడీ పండించారు. ఇక శ‌ర‌త్ కేల్క‌ర్‌కు భార్య‌గా సంజ‌న క‌నిపిస్తే తోబ‌..తోబ సాంగ్‌లో రాయ్ ల‌క్ష్మీ గ్లామ‌ర్ ట‌చ్ ఇచ్చింది.

సాంకేతిక వర్గం పనితీరు:

ఆర్థ‌ర్ ఏ విల్స‌న్ సినిమాటోగ్రఫీ చాల బాగుంది. సినిమా కి ఇది పెద్ద ఎస్సెట్.. సినిమాలో ర‌తన్‌పూర్ రాజ సంస్థానంతో పాటు ఆ గ్రామ వాతావ‌ర‌ణం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపారు. దేవిశ్రీ ప్రసాద్ రెచ్చిపోయాడు.సర్దార్ ఆడియోను మించిపోయేలా ఆర్ ఆర్ ఉంది. ప‌వ‌న్‌-కాజ‌ల్ మ‌ధ్య ల‌వ్‌సీన్ల‌తో పాటు యాక్ష‌న్‌, కామెడీ, పంచ్ డైలాగులు, గుర్రాల సీన్లు ఇలా ఒక‌టేమిటి సినిమాతో ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అయ్యి చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసేలా ఆర్ ఆర్ ఉంది. బుర్ర సాయి మాధవ్ రాసిన సంభాషణలు ఆలోచింప చేసేలా ఉన్నాయి. బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ వ‌ర్క్ చాల బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. సెకండ్ ఆఫ్ లో ఇంకొంచెం ఎడిటింగ్ చేసుంటే బాగుండేది.పవన్ కళ్యాన్ స్వతహాగా మంచి మార్షల్ ఆర్టిస్ట్ కావడం వల్ల అటువంటి హీరోకి ఎలాంటి ఫైట్స్ ఉండాలో సరిగ్గా అదేసన్నివేశాలను తెరకెక్కించారు ఫైట్ మాస్టర్స్ రామ్ — లక్ష్మణ్. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది.. ఇండియన్ క్లాసిక్ షోలే సినిమా లోని రాం ఘడ్ తరహాలో ఒక ఖాళీ ప్రదేశాన్ని రతన్ పూర్ లాంటి గ్రామంగా మలిచిన బ్రహ్మ కడలి నిజంగా మెచ్చుకోవచ్చు.రతన్ పూర్ లో ఒకవైపు పేదరికాన్ని చూపిస్తూ..మరో వైపు రాజ కోట.దానికి హంగులూ చాలా గొప్పగా చూపించాడు.

ప్లస్ పయింట్స్:

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్
  • రామ్ లక్ష్మన్ ఫైట్స్
  • మొత్తంగా కలిపికాకుండా విడివిడి సీన్లలో ఉన్న వినోదం
  • కాజల్ అగర్వాల్ నటన
  • సినిమాటోగ్రఫీ
  • రీ రికార్డింగ్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టొరీ
  • స్క్రీన్ ప్లే
  • సెకెండాఫ్ లో కథా,కథనాలు
  • ఎడిటింగ్

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్: గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.

(Visited 4,941 times, 238 visits today)