Home / Entertainment / బైక్ మీద అలీ…అలీ భుజాల మీద సర్దార్ గబ్బర్ సింగ్.

బైక్ మీద అలీ…అలీ భుజాల మీద సర్దార్ గబ్బర్ సింగ్.

Author:

Pawan Kalyan 1

పవన్‌కళ్యాణ్ తను నటీస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇక్కడే 20 రోజులపాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పవన్‌కళ్యాణ్ సినిమాలో అలీ తప్పకుండా ఉంటారు. పవన్‌కళ్యాణ్ ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నుండి కొన్ని ఫోటోలు విడుదలైంది. బైక్ మీద అలీ…అలీ భుజాల మీద పవన్‌కళ్యాణ్ ఉన్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని…. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

(Visited 214 times, 34 visits today)