EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఛుక్ ఛుక్ రైలు వచ్చింది.. పిజ్జా బర్గర్ తెచ్చింది.

Author:

రైల్లో ప్రయాణం చేయటం అంటే అందరికీ ఎంతో సరదా.. ఎంచక్కా కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలు చూస్తూ ప్రయాణం చేయొచ్చు. కానీ, రైలు భోజనమంటేనే మహా చిరాకు. ఇది అందరితో పాటూ రైల్వే శాఖకు కూడా అర్థమైనట్టుంది. అందుకే.. ఇక రైల్లో పిజ్జాలు, బర్గర్లతో సహా మనకు నచ్చిన ఆహారం అందించేందుకు రంగం సిద్దం చేసింది. అయితే.. ఇలా మనకు నచ్చిన ఫుడ్ ని, ప్రయాణ సమయానికి కనీసం రెండు గంటల ముందు ఈ కాటరింగ్ విధానం ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే డోమినాస్ పిజ్జా, మెక్ డోనాల్డ్ ,కే ఎఫ్ సీ, పిజ్జా హట్, హల్దీరాం, బికనూర్వాలా, సాగర్ రత్న మొదలగు సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది.

Say bye to boring railway food, get Domino’s pizza, McDonald’s burgers on trains

జూన్ 15 నుంచి ఈ సదుపాయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ముందుగా రాజధాని, శతాబ్ది రైళ్ళలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది జూన్ లోనే 45 రోజులపాటు ఢిల్లీ – ముంబై , పూణే – సికందరాబాద్ , హౌరా –పూరి నగరాల మధ్య నడిచే రైళ్ళలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అక్కడ ప్రయాప్రయాణికుల స్పందన బాగుండటంతో ఇప్పుడు మరిన్ని రైళ్ళలో, మరిన్నిరూట్లలో ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.

www.ecatering.irctc.co.in అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి చేసి మనం ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కు ప్రయాణిస్తున్నామో వివరాలు తెలుపగానే అక్కడ అందుబాటులో ఉండే అన్ని ఆహారాల పట్టిక కనబడుతుంది. ఇక మనకు నచ్చిన ఆహార పదార్ధాలు బుక్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ముందే చెల్లించవచ్చు లేదా ఫుడ్ డెలివరీ అయ్యాక కూడా చెల్లించవచ్చు. IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

(Visited 147 times, 30 visits today)

Comments

comments