సరదాగా మొక్కతో దిగిన సెల్ఫీ..అతనిని జైలుపాలు చేసింది.

Author:

ఈ స్మార్ట్ ఫోన్ లు, ఇంటర్నెట్ ల వాడకం బాగా పెరిగిపోయి అందరు సెల్ఫీ మోజులో మునిగితేలుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం పరిపాటి అయిపొయింది, చెన్నైలో సెల్ఫీ మోజులో ఒక యువకుడు చేసిన పని అతనిని జైలుపాలు చేసింది, అసలు ఏం జరిగిందంటే…

తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన శశికుమార్ అనే యువకుడు తన ఫ్రెండ్ కమల్ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి టెర్రస్ పైన కుండీల్లో రకరకాల మొక్కలు, అందమైన పూల చెట్లని చూడగానే తన స్మార్ట్ ఫోన్ కి పని చెప్పాడు. ఆ మొక్కలతో సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ సెల్ఫీ లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు, చివరికి ఓ మొక్కతో దిగిన ఈ సెల్ఫీనే శశికుమార్ ని జైలుపాలు చేసింది.

గంజాయితో సెల్ఫీ

ఇంతకీ శశికుమార్ చేసిన తప్పెంటో తెలుసా… గంజాయి మొక్కతో కలిసి సెల్ఫీ ఫోజు ఇవ్వడం. ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కొద్దిసేపటికే ఈ గంజాయి మొక్కసెల్ఫీ వైరల్‌గా పోలీసులకి కూడా చేరింది, దాంతో పోలీసులు గంజాయి మొక్కతో సెల్ఫీ ఫోజు ఇచ్చిన శశికుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ గంజాయి మొక్కను ఇంటిపై కుండీలో పెంచుతున్న అతడి స్నేహితుడు కమల్‌ను కూడా ఆరెస్ట్ చేసారు. అతడు ఇచ్చిన సమాచారంతో మూర్తి అనే మరో వ్యక్తిని ఆరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ రిమాండ్‌లో ఉన్నారు. ఏదో సరదాగా సెల్ఫీ దిగితే… అది కాస్తా ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది.

(Visited 1,272 times, 1,287 visits today)