ఈ ఫొటో చూడగానే “బాషా” సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.

Author:

నిర్లక్ష్యంగా నడపడం దురుసు గా సమాధానలివ్వడం, ఆటో ఛార్జీల పై అదనంగా వసూలు చేయడం అసాంఘిక కార్యకలాపాలు  చేసే చెడ్డ ఆటో డ్రైవర్ ల గురించి మనం చదువుతుంటాం. కొండకచో చూస్తుంటాం కూడా! అయితే ఈ ఆటోవాలా మాత్రం మంచి కారణంతోనే వార్తలకెక్కాడు.

చేతనైనంత సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబా దు బోరబండ నివాసి అయిన ఆటో డ్రైవర్ సంజయ్ కు చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించారు. కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న సంజయ్ ను 2010 లో జరిగిన సంఘటన మార్చేసింది.

ఒక అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతున్న తన భార్యని ఆస్పత్రి లో చేర్చటానికి ఆటోలే దొరకలేదు.

ఆసమయంలో రిక్షాతొక్కే ఒక పెద్దాయన సహాయంతో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్ళ గలిగాడు. అంతా అయిపోయాక ఒకవేళ సకాలంలో తన భార్య ఆస్పత్రి చేరకుంటే ఏమయ్యేదో తలచుకొన్నపుడు భయం బాధ కలిగాయి.

తీవ్రంగా ఆలోచించి కష్టపడి పని చేసి ఎలాగైనా ఆటో కొని అవసరార్ధులకు సహాయ పడాలని తీర్మానించుకొన్నాడు.

Service-sense-of-Auto-Driver-sanjay

పట్టుదలతో పని చేసి 2013లో ఆటో యజమాని అయ్యాడు.

అప్పట్నించి తన ఆటో లో గర్భిణీ స్త్రీలను వృద్ధులను, వికలాంగులను ఉచితంగా వైద్య శాలలకు చేరవేస్తున్నాడు. తనకు కలిగిన చేదు అనుభవం ఎవరికీ కలగరాదని పాటు పడ్తున్నాడు. తన ఆశయాన్ని సగర్వంగా ఆటో వెనకల రాసుకొని ప్రదర్శిస్తున్నాడు.

ఇప్పటి వరకూ ఇలా 260మందికి సహాయంచేశాడు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూఉండకుండా సమాజానికి తనవంతు సేవ చేస్తున్న సంజయ్ అభినందనీయుడు. పెద్ద మనసు కూ పేదరికానికీ సంబంధంలేదని నిరూపిస్తున్న సంజయ్ ని మనమూ “శభాష్ సంజయ్ ” అందామా?!

(Visited 1 times, 152 visits today)