EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’చూపిస్త అంటున్న రాజ్ తరుణ్.

Author:

Sethamma andalu ramayya chithralu

‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ ఫీట్‌ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్. ఈ మధ్యే విడుదలైన ‘కుమారి 21F’తో తన రేంజ్ పెంచుకున్న రాజ్ తరుణ్, అప్పుడే తన కొత్త సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ను కూడా విడుదలకు సిద్ధం చేసేశారు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. హీరో సునీల్, ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, మారుతి తదితరులు అతిథులుగా విచ్చేసి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్‌ను విడుదల చేశారు.

ఇక ఈ టీజర్‌తో రాజ్ తరుణ్ మళ్ళీ తన ఉయ్యాల జంపాల ఫ్లేవర్‌ను తీసుకొచ్చారనే చెప్పాలి. ఓ క్యూట్ లవ్‌స్టోరీగా సినిమా ఉండనుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. ఇక రాజ్ తరుణ్ చెప్పిన “నాది నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయిపోయి, లేనప్పుడు డిస్‌కనెక్ట్ అయిపోయే యూత్ లవ్‌స్టోరీ కాదురా, చిన్నప్పటి స్వీట్ లవ్‌స్టోరీ” అన్న డైలాగ్ సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ ఆకట్టుకునేలా ఉంది. రాజ్ తరుణ్ సరసన అర్తనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జనవరి నెలాఖర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

(Visited 240 times, 65 visits today)

Comments

comments