Home / Entertainment / ‘శంకరాభరణం’కి “మేము” అడ్డు అంటున్న సూర్య.

‘శంకరాభరణం’కి “మేము” అడ్డు అంటున్న సూర్య.

Author:

Memuప్రముఖ రచయితా కోన వెంకట్ కథ – మాటలను అందించడమే కాకుండా సహా నిర్మాతగా వ్యవహరించిన ‘శంకరాభరణం’సినిమాలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా, నందిత హీరోయిన్ గా తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ. హీరోయిన్ అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమా షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. కోన వెంకట్ సహ నిర్మాత కావడం వల్ల దగ్గరుండి సినమా ప్రచార కార్యక్రమాలను సినిమా పరిశ్రమలో అందరితో చేయిస్తున్నడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోనే ఉంది . అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకి డిసెంబర్ 4న ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ కావాల్సింది.

sankarabharanam-movie-motion-pos

కానీ తాజా సమాచారం ప్రకారం శంకరాభరణం సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద సూర్య పోటీ పడనున్నాడు. సూర్య, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించిన పిల్లల చిత్రం ‘పసంగ 2’. ఈ సినిమాని తెలుగులో మేము పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ఫిక్స్ అయ్యింది. తెలుగులో కూడా ఒకేరోజున రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. దీని ప్రకారం నిఖిల్ శంకరాభరణం, సూర్య మేము సినిమాలు డిసెంబర్ 4న బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనున్నాయి. ఇప్పటి వరకూ పోటీనే లేదు అనుకున్న శంకరాభరణం టీంకి ఇది ఒక చిన్న షాక్ అనే చెప్పాలి.

(Visited 29 times, 14 visits today)