అక్కినేని కోడలు కావల్సిన శ్రియా భూపాల్ ఇప్పుడు అపోలో ఫ్యామిలీలోకి అడుగుపెడుతోందా?

Author:

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీలోకి కోడ‌లిగా ఎంట్రీ ఇచ్చిన సమంత‌ కన్నా ముందే అక్కినేని కోడలయ్యే ఛాన్స్ మిస్ అయిన శ్రేయా భూపాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంద‌ని తెలుస్తోంది. నాగ్ చిన్న కుమారుడు అఖిల్‌తో ప్రేమాయ‌ణం, ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యాక ఇటలీలో పెళ్లికి రెడీ అవుతోన్న వేళ ఓ ఫంక్ష‌న్‌లో అఖిల్ – శ్రియా మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో చివ‌ర‌కు ఆ వివాదం కాస్తా పెద్ద‌ది కావ‌డంతో వారిద్ద‌రు విడిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.అఖిల్ – శ్రియా ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా పెళ్లి క్యాన్సిల్ కావ‌డంతో రెండు కుటుంబాలు చాలా డిస్ట‌ర్బ్ అయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం శ్రేయ భూపాల్ ఓ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైందట. అఖిల్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత శ్రేయ కుటుంబ సభ్యులు ఎన్నారై సంబంధం చూసారని, ఆ వ్యక్తిని చేసుకునేందుకు శ్రేయ కూడా సిద్దంగా ఉందని సమాచారం. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కజిన్ అనిన్ దిత్ అని తెలుస్తుంది. అనిన్‌ను శ్రియా పెళ్లాడితే ఉపాస‌న‌కు మ‌ర‌ద‌లు అవుతుంది.

Akhil-ex-Shreya-Bhupal-going-to-marry-upasana-cousin-brother

అయితే ఇప్పటివరకూ ఈ పెళ్లి గురించి శ్రీయ భూపాల్ కుటుంబం కానీ, అనిన్ దిత్ కుటుంబం నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.అలా అని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టుగా కూడా వార్తలు రాలేదు..దీంతో ఈ పెళ్లి కన్ఫామ్ అని అనుకుంటున్నారు.అంతేకాదు అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ తర్వాత అటు జివికె కుటుంబం,ఇటు అక్కినేని కుటుంబం కూడా పెళ్లి ఎందుకు రద్దు అయిందనే దాని గురించి మాట్లాడలేదు..కానీ పెళ్లి క్యాన్సిల్ అనే వార్త మాత్రం దావాణంలా వ్యాపించింది. దాంతో ఈ సమస్య తొందరగా పోవాలంటే శ్రీయా పెళ్లి చేయడమే కరెక్ట్ అని భావించి పెళ్లి నిశ్చయించారట..

(Visited 1,224 times, 1,256 visits today)