Home / Entertainment / బాహుబలి-2 లో సూర్య వల్లే సుదీప్ ని తప్పిస్తున్నారా?

బాహుబలి-2 లో సూర్య వల్లే సుదీప్ ని తప్పిస్తున్నారా?

Author:

Shriya Saran and Suriya in SS Rajamouli’s Baahubali-2

ఇండస్ట్రీలో ఇక శ్రియ శకం ముగిస్నట్టే ననీ ఆమె పని ఇక అయిపోందని కామెంట్ చేసిన వారికి క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ సరిన రిప్లై ఇస్తోంది శ్రియ.మనంలో నాగార్జున సరసన నటించి తన లో ఇంకా నటించే సత్తా ఉందని నిరూపించుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గోపాల గోపాల లో కూడా వెంకీ భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఇప్పుడు తాజాగా వినిపించే న్యూస్ ఏమిటంటే స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన అప్ కమింగ్ మూవీ బాహుబలి సెకండ్ పార్ట్‌లో నటించే అవకాశాన్ని శ్రియ కి  ఇచ్చాడని వినిపిస్తోంది. బాహుబలి 2 కథని కీలక మలుపు తిప్పే ఓ ముఖ్యమైన పాత్రలో శ్రియ కనిపించబోతుందని సమాచారం. భల్లాలదేవుడిగా నటించిన రానా భార్య పాత్రలో శ్రియా కనిపించ వచ్చు అంటున్నారు. ఇదివరలో ప్రభాస్ కి జోడీ గా రాజమౌళీ దర్శకత్వం లోనే “చత్రపతి సినిమాలో చేసినప్పుడే శ్రియ టాలెంట్ ని గుర్తుపెట్టుకున్నాడు జక్కన్న అంటున్నారు టాలీవుడ్ జనాలు.

ఇక శ్రేయ సంగతి ఇలా ఉంటే తమిళం లోనే కాక తెలుగులోనూ సమాన స్తాయి మార్కెట్ ఉన్న హీరో సూర్య కూడా బాహుబలి లో భాగం కానున్నాడట. బాహుబ‌లి-2లో ఓ ముఖ్య పాత్ర‌ను సూర్య‌కు క‌ట్ట‌బెట్టిన‌ట్లు రాజ‌మౌళి చెప్పేసారు కూడా. బాహుబ‌లి లాంటి అంత‌ర్జాతీయ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇస్తే సంతో షంగా చేస్తాన‌ని సూర్య ఆ మ‌ధ్య ఓ ఆడియో వేడుక‌లో అనటం రాజమౌళిని కాస్త బాదించిందట అంతటి హీరో అలా అడగటం జక్కన్నకి భాగా నచ్చిందట. దాంతో సూర్యాని ఇన్వాల్వ్ చేసేసినట్టు ప్రకటించేసాడు. ఆ మ‌ధ్య బాహుబ‌లిలో నాగార్జున‌,సూర్య‌లను కీల‌క రోల్స్ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో సూర్య‌కు కన్ఫ‌మ్ అయ్యారు. “బాహుబలి 2″లో ప్రభాస్ కు ఆపద సమయం ఎదురైన‌ప్పుడు ఆదుకొనే వేరే దేశపు మహారాజుగా సూర్య క‌నిపించ‌నున్నారట‌. ఇక మిగిలింది నాగార్జున ఒక్క‌రే. ఇక నాగ్ కూడా ఈ బాహుబలి టీం లోకి అడుగు పెడితే బాహుబ‌లి -2 రేంజ్ మారిపోతుంది. బాలివుడ్ లోనూ కొంత క్రేజ్ ఉన్న నాగార్జున నార్త్ ఇండియన్ మార్కెట్ కీ ప్లస్ ఔతాడు. ఐతే సూర్యది ఎక్కువ సేపు ఉండే పాత్ర ఏమీ కాదు కానీ కీలకమైన సన్ని వేసం కావటం తో ప్రేక్షకుడిని కొద్దిసేపు ఉద్వేగ పరిచేలా ఉంటుందని అనుకుంటున్నారు. బాహుబలి సినిమాలో ఇప్పటికే కన్నడ నటుడు సుదీప్ కూడా ఉన్నాడు. పార్ట్-2లో కూడా ఇంకాస్త ఎక్కువ సమయమే కనిపించనున్నాడు.

ప్రభాస్-సుదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్-2లోనే కనిపిస్తాయి. అయితే సూర్య రాకతో సుదీప్ కు ఎర్త్ పడింది. సూర్య కోసం సృష్టించిన పాత్ర కోసం సుదీప్ పాత్ర నిడివిని తగ్గించాలని ఆలోచిస్తున్నాదట రాజమౌళి. ప్రస్తుతం సూర్య “సింగం 3, పసంగ 2, 24” చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ గ్యాప్ లో ఒక మూడు, నాలుగు రోజులు పాటు “బాహుబలికి డేట్లు కేట‌యించిన‌ట్లు స‌మాచారం.

(Visited 88 times, 34 visits today)