ఇతడే శ్రుతి హాసన్ బాయ్ ఫ్రెండ్.

Author:

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు…గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది. శృతి హాసన్ అందరి హీరోయిన్ల మాదిరిగా కాకుండా డాన్స్, పాటలు పాడటం మరియు సంగీతం విషయంలో అందరి కంటే ముందు వరసలో ఉంటుంది.  ఈ అమ్మడు గతంలో క్రికెటర్ రైనాతో ప్రేమలో ఉందని పుకార్లు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని అందరికి తెలిసిపోయింది. కానీ, ఇప్పుడు శృతి ఒక బ్రిటన్ నటుడితో గత 3 నెలలుగా ప్రేమాయణం సాగిస్తుంది.

Shruthi Hassan Date With Her Boyfriend

శృతి హాసన్, మైఖేల్ కసలే అనే బ్రిటన్ యువకుడితో 2 రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో కూడా వారు ఇలా కలిసిన సందర్భాలు ఉన్నాయి. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా గత వారం మైఖేల్ ఇండియాకి వచ్చాడని, వాలెంటైన్స్ డే రోజు కొంత సమయం శృతితో గడిపినట్టు సమాచారం. శృతి ఓ సాంగ్ రికార్డు చేయటం కోసం లండన్ వెళ్లిన సమయంలో మైఖేల్ పరిచయం అయ్యాడని, తరువాత వారి పరిచయం ప్రేమగా మారి 3 నెలలుగా రహస్యంగా డేట్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి, శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు కూడా ఈ విషయంపైనా ఆమె స్పందించక పోవచ్చు.

Source: https://mangobollywood.com/2017/02/17/shruthi-hassan-romantic-date-with-her-boyfriend-see-pics/

(Visited 1,045 times, 85 visits today)