Home / health / మనం వాడే టూత్ పేస్ట్ లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.

మనం వాడే టూత్ పేస్ట్ లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.

Author:

ఉదయం నిద్రలేవగానే.. బ్రష్‌ పట్టుకుని బాత్‌రూంలోకి వెళ్తాం. అందుబాటులో ఉన్న లేదా.. టివీ ప్రకటల్లో నచ్చిన పేస్ట్‌ను వాడి..దంతాలు మెరుస్తున్నయా ? లేదా అని అద్దంలో చూసుకుంటాం. అయితే టూత్‌ పేస్ట్‌ వాడకం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోం. అధికంగా టూత్‌పేస్ట్‌లు వాడితే వచ్చే అనారోగ్య సమస్యలపై ఇటీవల పరిశోధనలు జరిగాయి..

side-effects-of-tooth-paste

– టూత్‌ పేస్ట్‌ వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయట.నోటిలోని క్రిములను నాశనం చేసేందుకు టూత్‌ పేస్ట్‌లలో ”ట్రిక్లోసెన్‌”అనే రసాయనాన్ని కలుపుతారట. దీని కారణంగా థైరాయిడ్‌, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

– టూత్‌ పేస్టులలో పాలీ ఇథైలిన్‌ ఉంటుంది. ఈ రసాయనం శరీరానికి విషపదార్థం మాదిరిగా భావించాలి. దీని కారణంగా మూత్రపిండాలు, మెదడు సమస్యలు వస్తాయట.

– టూత్‌ పేస్ట్‌ తయారీలో ప్లోరైడ్‌ను ఎక్కువగా వాడతారు. ఇవి చిగుళ్ళను మాత్రమే కాకుండా, పిల్లలలో తెలివి తేటలను తగ్గించి వేస్తాయి. గర్భిణులు ప్లోరైడ్‌ ఉన్న టూత్‌ పేస్ట్‌ల వాడకపోవడమే మంచిది. వీటి వలన థైరాయిడ్‌ సమస్యలతో పాటు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. కడుపులోని బిడ్డ ఎముకల దృఢత్వాన్ని ఫ్లోరైడ్‌ అడుకుంటుంది.

– సోడియం లారిల్‌ సల్ఫేట్‌ను టూత్‌పేస్టు తయారీలో కూడా వాడతారు. వీటి వలన నోట్లో అల్సర్‌లు, చర్మ సమస్యతో పాటు హార్మోన్లలో అసమానతలు కూడా తలెత్తుతాయి.

– తీపి పదార్థాలు ఎక్కువగా తింటే దంతాలు పాడవుతాయి అంటారు. కానీ, టూత్‌పేస్ట్‌లలో కూడా చక్కెర ఉంటుంది. ఈ కృత్రిమ చక్కెరల వల్ల మధుమేహం, స్థూలకాయం వస్తుందని పరిశోధనలలో వెలువడింది. అంతే కాకుండా, టూత్‌పేస్ట్‌లలో ఎక్కువగా ఉపయోగించే రసాయనాల వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ వంటి క్యాన్సర్‌ సమస్యలు కూడా వస్తాయట.

సో… దంతాలు మిలమిల మెరవాలంటూ వాడే టూత్‌పేస్ట్‌లతో ఇన్ని సమస్యలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకున్న తర్వాత మన పూర్వీకుల మాదిరిగా.. వేపపుల్లలు, ఉత్తరేణి వేర్లు(మిస్ వాక్), బొగ్గుపొడి వాడటమే ఉత్తమం అనిపిస్తుంది కదూ..! అంతే కాదు మీరు వాడే టూత్ పేస్ట్ ట్యూబ్ మీద ఉండే గుర్తులను బట్టీ అది మీ ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకోవచ్చు అదెలా అంటే…

మీరు వాడే టూత్‌పేస్ట్ ట్యూబ్‌ల కింది భాగాన్ని ఎప్పుడైనా పరిశీలించారా? అక్కడ ఎరుపు, నలుపు, బ్లూ, ఆకుపచ్చ రంగుల్లో చిన్నగా, లావుగా ఉండే గీత లాంటి గుర్తును చూశారా? అవును, చూసే ఉంటారు. అయితే అదే గుర్తు సదరు టూత్‌పేస్ట్‌ను ఏ పదార్థంతో తయారుచేశారో, సహజ సిద్ధమైంది అవునో, కాదో చెప్పేస్తుంది.

  • టూత్‌పేస్ట్ ట్యూబ్ కింది భాగంలో ఉండే గీత నలుపు రంగులో ఉంటే ఆ టూత్‌పేస్ట్‌ను 100 శాతం కెమికల్స్‌తో తయారు చేశారని అర్థం.
  • అదే ఆ గీత గ్రీన్ కలర్‌లో ఉంటే ఆ టూత్‌పేస్ట్ 100 శాతం సహజ సిద్ధమైందని తెలుస్తుంది.
  • నీలి రంగులో గీత ఉంటే ఆ టూత్‌పేస్ట్‌ను సహజసిద్ధమైన, మెడికల్ పదార్థాలను కలిపి తయారు చేశారని తెలుసుకోవాలి.
  • ఒక వేళ గీత ఎరుపు రంగులో ఉంటే ఆ టూత్‌పేస్ట్ సహజ సిద్ధమైన, కెమికల్ పదార్థాలతో తయారైందని తెలుస్తుంది.

సో, ఇకముందు మీరు టూత్‌పేస్ట్‌ను కొనేముందు ఈ గీతలను చూసి కొనుగోలు చేయండి.

(Visited 2,732 times, 93 visits today)