Home / Entertainment / ‘సింగం-3’ ఫస్ట్ లుక్ విడుదల.

‘సింగం-3’ ఫస్ట్ లుక్ విడుదల.

Author:

SIngam-3-first-look-Poster-released

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో, తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. వాణిజ్య అంశాలు వదులుకోకుండా విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారాయన. సూర్య, అనుష్క జంటగా నటించిన సింగం, సింగం-2 చిత్రాలు దక్షిణాది సినీ ప్రేక్షకులను ఎంతగా అలరించాయో తెలిసిన విషయమే. అయితే ఆ చిత్రాలకు సీక్వెల్ గా ‘సింగం-3’ లో మరోసారి సూర్య, అనుష్క జంటగా నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారధ్యంలో హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘సింగం-3’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళ వెర్షన్ లో విడుదల చేసిన ఈ పోస్టర్ స్టైలిష్ గా ఉండటంతో పాటు ఈ చిత్రంలో అంతకు ముందు చిత్రాల కంటే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రని మరింత పవర్ ఫుల్ గా చుపించబోతున్నాడు.

(Visited 158 times, 29 visits today)