Home / Entertainment / విడుదలకు ముందే కోట్లు కొల్లగొట్టిన సూర్య “సింగం 3”

విడుదలకు ముందే కోట్లు కొల్లగొట్టిన సూర్య “సింగం 3”

Author:

తమిళ హీరో సూర్య నటించిన సింగం సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మొదటి రెండు సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సింగం 3 సినిమా ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడినా ఈ సినిమా మీదా ప్రేక్షకులకు భారి అంచానాలే ఉన్నాయి అందుకే ఈ సినిమా విడుదల కు ముందే 100 కోట్ల బిజినెస్ చేసిందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రకటించారు. డిస్ట్రిబూటుర్ హక్కులు, సినిమా శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు సాదించి పెట్టింది.

పవర్ ఉన్న పోలీస్ “నరసింహం” పాత్రతో మొదటి రెండు సినిమాలను హిట్ చేసిన సూర్య ఇప్పుడు మూడో సారి హరి దర్శకత్వంలో అదే పాత్రలో సింగం 3 (ఎస్-3) గా మనముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని హరీశ్ జయరాజ్ సమకూర్చారు. సినిమాలో సూర్య సరసన అనుష్క మరియు శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తాకుర్ అనూప్ సింగ్ విలన్ గా నటిస్తున్నారు.

(Visited 167 times, 5 visits today)