EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Reviews / సింగం 3 రివ్యూ & రేటింగ్.

సింగం 3 రివ్యూ & రేటింగ్.

సింగం 3 రివ్యూ singam review

Alajadi Rating

2.75/5

Cast: సూర్య, శృతి హాసన్, అనుష్క, ఠాకూర్ అనూప్ సింగ్

Directed by: హరి

Produced by: జ్ఞానవేల్ రాజా

Banner: స్టూడియో గ్రీన్

Music Composed by: హరీస్ జైరాజ్

హరి దర్శకత్వంలో హీరో సూర్య, అనుష్క హీరోయిన్ లుగా సింగం సీరిస్ లో భాగంగా తెరకెక్కిన చిత్రం సింగం 3. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సూర్య సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తోపాటు, అనుష్క, శృతిహాసన్ వంటి అందాల తారలు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకోగలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఒక పోలీస్ కమిషనర్ హత్యకి సంబంధించిన కేసుని విచారించడానికి నరసింహ(సూర్య) ని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు, ఆ కేసు తనదైన శైలిలో విచారిస్తూ ఆ కేసు వెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటాడు, ఆ తర్వాత ఈ కేసును పూర్తి చేయడం కోసం నరసింహ ఏం చేశాడు? కమిషనర్ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు..?  ఈ కేసుకి అగ్ని (శృతి హాసన్) కి సంబంధం ఏమిటి..? నరసింహం తన భార్యని (అనుష్క)ని ఎందుకు దూరం పెట్టాడు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

సింగం సిరీస్ లో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, ఆ రెండు సినిమాలకి మించిన యాక్షన్ ఎపిసోడ్ లు ఈ సినిమాలో ఉన్నాయి, మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించే పవర్ ఫుల్ డైలాగ్లు, యాక్షన్ ఎపిసోడ్ లకి ఈ సినిమాలో కొదువ లేదు.

ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలతో అసలు కథలోకి సినిమా వెళ్తుంది, దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఇంటర్వెల్ తరువాత వచ్చే ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా అలరిస్తాయి, క్లైమాక్స్ కి ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకే హైలైట్, కానీ హీరో పాత్ర ఫుల్ పవర్ ఫుల్ గా ఉంటడం మిగిలిన పాత్రలు తేలిపోవటం వల్ల కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది, మొత్తంగా చూసుకుంటే సూర్య మాస్ యాక్షన్ ఎంటెర్టైనమెంట్ కోసం ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పనితీరు:

సూర్య: అతని నటనకి, ఎనర్జీకి ఎవరైనా హేట్సప్ చీపాల్సిందే. ముఖ్యంగా కథలో అసలు పాయింట్ రివీల్ అయిన దగ్గర నుండి సూర్య యొక్క ఎనర్జీ నే సినిమాని ముందుకి నడిపిస్తుంది. ఇక పోరాట సన్నివేశాల్లో అయితే సూర్య చూపినఇంటెన్సిటీ నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నరసింహ గా మొదటి రెండు భాగాల్లో సూపర్ సక్సస్ అయిన సూర్య , ఈ చిత్రంలో అంతకు మించి స‌క్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు.

అనుష్క: కావ్య గా నటన పరంగా ఓకే అనిపించినా, అందం విషయంలో అనుష్క కాస్త మందంగా తయారవడం ప్రేక్షకులను కాస్త నిరుత్సాహానికి గురయ్యేలా చేసిందనే చెప్పుకోవాలి.

శృతిహాసన్: జర్నలిస్ట్ గా శృతి హాసన్ ఈ సినిమాలో రెచ్చిపోయింది. ఒక వైపు అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూనే, మరోవైపు శృతి చేసిన అందాల విందు అంతా ఇంతా కాదు. తన నటనతో ప్రేక్షకులనందరిని కట్టిపడేసింది.

ఇక ఈ చిత్రంలోని మిగతా నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:

  • సూర్య నటన, సూర్య ఎనర్జీ లెవల్స్
  • శృతిహాసన్
  • యాక్షన్ సీన్స్
  • సినిమాటోగ్ర‌ఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ క‌థ‌
  • మ్యూజిక్

Comments

comments