Video: అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ఆరెస్ట్..!

Author:

ప్రముఖ గాయకుడు, సాహితీ ప్రముఖుడు గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గజల్ సాహిత్యానికి విశేష కృషి చేసిన వ్యక్తిగా, పలు మీడియా సంస్థల్లో పట్టు ఉన్న వ్యక్తిగా పేరున్న గజల్ శ్రీనివాస్‌ అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. ఇంతకూ ఏ నేరం మీద గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారన్నది చూస్తే.. ఒక రేడియో జాకీని లైంగికంగా వేధింపులకు గురి చేశారన్న ఆరోపణ మీద కావటం సంచలనంగా మారింది.

ఆలయవాణి వెబ్ రేడియోలో రేడియో జాకీగా కుమారి పనిచేస్తున్న కుమారి అనే అమ్మాయి తనను గజల్ శ్రీనివాస్‌ రెండు నెలలుగా లైంగింకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ,అసభ్య పదజాలంతో మెసేజ్ లు పంపుతున్నారని పక్క ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గజల్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు గజల్ శ్రీనివాస్ కి 12 రోజుల రిమాండ్ విధించింది.

పంజాగుట్ట ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ… వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులోనే కుమారిపై శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తన గదిలోకి యువతిని పిలిపించుకొని.. లొంగదీసుకునే ప్రయత్నం గజల్ శ్రీనివాస్‌ చేసినట్లు వీడియోల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆమెతో మసాజ్ చేయించుకోవడం.. ఒంటి మీద బట్టలు లేకుండా ఉండమని చెప్పడం.. బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయని ఏసీపీ తెలిపారు. గత రెండు నెలల నుంచి శ్రీనివాస్.. కుమారిని వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేకనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఏసీపీ స్పష్టం చేశారు.

(Visited 165 times, 193 visits today)