Home / Entertainment / కేసీఆర్ నన్ను ఆదుకోండి అంటూ కోరిన సింగర్ మధుప్రియ.

కేసీఆర్ నన్ను ఆదుకోండి అంటూ కోరిన సింగర్ మధుప్రియ.

Author:

Singer Madhu Priya

సింగర్ మధుప్రియ మరోసారి వార్తల్లోకెక్కెక్కింది. తనను కెసీఆర్ యే ఆదుకోవాలని కోరుతూ ఆమె ఇంకోసారి పత్రికా ముఖంగా విఙ్ఞప్తి చేస్తూ వచ్చిన వార్త ఇంకో హాట్ టాపిక్ అయ్యింది . మధుప్రియ ప్రేమ వివాహం, తర్వాత భర్త పై కేసు పెట్టడం తర్వాత తల్లీదండ్రులే అంతా చేశారంటూ వివరణ ఇవ్వడం ఇలా కొన్ని నెలలుగా మీడియాలో సంచలనం గా నిలుస్తూవస్తోంది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం సరిదిద్దుకొని ఇప్పుడు భర్త శ్రీకాంత్ తో హ్యాపీగా ఉంటుంది మధు ప్రియ. ప్రస్తుతం తనను తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. తెలంగాణా ఉద్యమంలో ఉన్న వారందరినీ ఆదుకున్న కేసీఆర్ తనకు కూడా ఏదైనా చేయాలని కోరింది. ఆరేళ్ళ వయసు నుండే చీరలు కట్టుకుని పాటలు పాడానని, తెలంగాణా రాష్ట్రం వచ్చిన సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్నారని, తనుమాత్రం ఏ ఆధారమూ లేకుండా బాధపడుతున్నానని, ఉధ్యమ కాలంలో తాను చేసిన కృషిని గుర్తించి తనకు కూడా కేసీఆర్ ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలని కోరింది.

గతంలో మాటీవీ లో సూపర్ సింగర్స్ కార్యక్రమం ఓ ట్రెండ్ గా సాగుతున్న కాలంలో విదేశాల నుండి మధుప్రియతో పాటు ఇతర సింగర్స్ ను పెద్ద పెద్ద కార్యక్రమాలకు పిలిచే వారు మన తెలుగు వారు. అంతే కాకుండా టీ న్యూస్లో యాంకర్ గా కూడా మధుప్రియ కి కొంత ఆదాయం వచ్చేది కానీ వీట్లో ఏదీ ఒక స్థిరమైన ఆదాయ మార్గం కాకపోవటం, ఇప్పుడు మన తెలుగు వారుంటున్న విదేశాల్లో కూడా పెద్ద కార్యక్రమాలేమీ నిర్వహించకపోవటం వల్ల ఆమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పావలా శ్యామల విషయంలో పాజిటివ్ గా స్పందించి కళాకారిణి గా ఆమెకు సాయమందించిన కేసీఆర్ తన విషయం లోనూ స్పందిస్తారని ఆశతో ఉన్నట్టు తెలిపింది మధుప్రియ. మరి ముఖ్యమంత్రి మధుప్రియ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

(Visited 1,802 times, 22 visits today)